Chandrababu: కుప్పం గడ్డ నుంచి వైసీపీకి బాబు అల్టిమేటం… అన్నింటికీ వడ్డీతో సహా సమాధానం ఇస్తామని వార్నింగ్

కుప్పం గడ్డ నుంచి వైసీపీకి అల్టిమేటం జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇంకా ఉండేది ఒకటిన్నర సంవత్సరమేనని... తర్వాత వడ్డీతో సహా అన్నింటికీ సమాధానం ఇస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

  • Ram Naramaneni
  • Publish Date - 10:03 pm, Thu, 25 February 21
Chandrababu: కుప్పం గడ్డ నుంచి వైసీపీకి బాబు అల్టిమేటం... అన్నింటికీ వడ్డీతో సహా సమాధానం ఇస్తామని వార్నింగ్
AP Local Body Elections

Chandrababu:  కుప్పం గడ్డ నుంచి వైసీపీకి అల్టిమేటం జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇంకా ఉండేది ఒకటిన్నర సంవత్సరమేనని… తర్వాత వడ్డీతో సహా అన్నింటికీ సమాధానం ఇస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. జమిలి ఎన్నికలు రావడం, వైసీపీ నేతలు ఇంటికి వెళ్లడం ఖాయమని కామెంట్‌ చేశారు. అధికారుల పనితీరును అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు చంద్రబాబు. కార్యకర్తలపై తప్పుడు కేసులు ఒక్క సంతకంతో మాఫీ చేస్తానన్న బాబు.. రెండేళ్లు గడుస్తున్నా కుప్పానికి నీళ్లు ఇవ్వలేదన్నారు. 3 రోజుల పర్యటన కోసం కుప్పం వచ్చారు చంద్రబాబు. ఆయనకు గుడిపల్లిలో ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అధినేత తన సొంత నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టారు. మండలాల వారీగా కార్యకర్తలు, నేతలతో మాట్లాడి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

కుప్పంలో చంద్రబాబు టూర్‌ ఎంత టెన్షన్‌ రేపిందో… జూనియర్‌ ఎన్టీఆర్‌పై చర్చ అంతే ఆసక్తి రేపుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అధినేత టూర్లో ఎన్టీఆర్‌ ఫ్యామిలీ ఫొటోలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. గతంలో చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఆయన ఫొటోలతోనే ఫ్లెక్సీలు పెట్టే వారు. ఇప్పుడు గుడుపల్లిలో పెట్టిన బ్యానర్లలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణల ఫొటోలు ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫొటోను కూడా బ్యానర్లలో పెట్టారు. అదే కుప్పంలో టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది.

ఈ సందర్భంగానే గుడిపల్లిలో కార్యకర్తలతో మాట్లాడుతూ… వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు చంద్రబాబు. తమను అణగదొక్కాలని చూస్తే… కుప్పం తడాఖా చూపిస్తామన్నారు. ప్రశాంత కుప్పం నియోజకవర్గంలో అలజడులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో చోటా వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని దుయ్యబట్టారు. డబ్బులు వసూలు చేసుకోవటానికి ఉబలాటపడుతున్నారని.. పుంగనూరులో ఓ మహా నేత సర్వం దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు

కుప్పం ప్రజలను భయపెట్టి తనను దెబ్బతీయాలని చూశారని చంద్రబాబు మండిపడ్డారు. 1984లో మందుపాతరలకే తాను భయపడలేదన్నారు. 40 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదన్న చంద్రబాబు.. కుప్పంలో జూద సంస్కృతి తీసుకువచ్చారని విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం చాలాసార్లు కుప్పంను పట్టించుకోలేదన్నారు. కుప్పం శ్రేణుల్లో కొత్త రక్తం ఎక్కించడం తన బాధ్యతన్న చంద్రబాబు.. కార్యకర్తల కోసం ఎంతైనా ఖర్చు పెడతానన్నారు. చంద్రబాబు కుప్పం టూర్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. కొడతనపల్లి దగ్గర ఆయన కాన్వాయ్‌ వెళ్తుండగా.. ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా.. పక్కనున్నవాళ్లు అడ్డుకున్నారు. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఢీలా పడ్డ కుప్పుం తెలుగు తమ్ముళ్లను చంద్రబాబు సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read:

Mars: భూమికి మనం ఏలియన్స్‌గా వచ్చామా..? మార్స్‌ మన సొంత ఊరా..?.. ఆసక్తికర వివరాలు మీ కోసం..

ఎదురీత ముందు.. విధిరాత ఎంత..?.. కష్టాల దిగమింగి.. కన్నీళ్లను చెరిపేసి.. మెకానిక్‌గా మహిళ జీవనపోరాటం

సలాం డాక్టరమ్మా..! పది రూపాయలకే వైద్యం.. ‌భవిష్యత్ తరాలకు ఆదర్శం