ఉద్యోగాల భర్తీపై స్పష్టతనిచ్చిన మంత్రి కేటీఆర్.. బహిరంగంగా లేఖ విడుదల.. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

TRS Working President KTR : ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

ఉద్యోగాల భర్తీపై స్పష్టతనిచ్చిన మంత్రి కేటీఆర్.. బహిరంగంగా లేఖ విడుదల.. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..
uppula Raju

|

Feb 26, 2021 | 6:10 AM

TRS Working President KTR : ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. అలవాటైన అబద్ధాలు, అర్ధసత్యాలతో యువతను గందరగోళంలో పడేస్తున్నాయన్నారు. 2014లో TRS పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2020 వరకు లక్షా 32 వేల 899 ఉద్యోగాలు భర్తీ చేశామని మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి శాఖల వారీగా ఉద్యోగాల భర్తీని లేఖలో వివరించారు. అనుమానమున్న వారు ఆయా శాఖల్లో ధృవీకరించుకోవచ్చన్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చెప్తానన్న జానారెడ్డి అందులో తెలంగాణకు దక్కినవెన్నో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. KCR చెప్పిన 50 వేల ఉద్యాగల భర్తీకి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎలక్షన్ కోడ్ ముగియగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. సంబంధిత శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి.

1.తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 30,594 2.తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ -31,972 3.తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు- 3,623 4.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ – హైదరాబాద్ – 179 5.శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ – హైదరాబాద్- 80 6.డైరెక్టర్, మైనారిటీస్ వెల్ఫేర్ – 66 7.జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్ – 9,355 8.డిపార్ట్మెంట్ అఫ్ ఆయుష్ – 171 9.టీఎస్ జెన్ కో- 856 10.టీఎస్ ఎన్పీడీసీఎల్ – 164 11.టిఎస్ ఎస్పిడిసిఎల్ – 201 12. టీఎస్ ట్రాన్స్ కో – 206 13.టిఎస్-ఆర్ టి సి- 4,768 14.సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్-12,500 15.జెన్కో, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్ పి డి సి ఎల్ – 6,648 16.విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ – 22,637 17.హైదరాబాద్ జలమండలి- 807 18.తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ – 243 19.డిసిసిబిలు – 1,571 20.భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు – 6,258 మొత్తం ఉద్యోగాల సంఖ్య – 1,32,899

ఇలా ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే విప్లవాత్మకమైన టీఎస్ఐపాస్ విధానంతో ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను గత ఆరు సంవత్సరాల్లో తెలంగాణ యువతకు కల్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని హితవు చెప్పారు.

తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గ్రేట్ న్యూస్… 50% శాతం రాయితీ.. దీపావళి పర్వదినాన వెల్లడించిన మునిసిపల్ మంత్రి

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రిస్క్‌ తీసుకుంటా..! సినిమాపై నమ్మకంతోనే అంత ఖర్చు పెట్టా అంటున్న డైనమిక్ హీరో..

MALDIEVES : మాల్దీవుల్లో ఏం మజా ఉందో.. తారలకు ఎందుకంత మోజో! ఆ సిక్రేట్​ ఏంటో తెలుసుకోవాలని ఉందా..?

నవ్వించే ఈ బుడ్డోడు.. తక్కువోడేం కాదు.. నైజీరియాలో పెద్ద తురుము.. ! మీమ్స్‌తో అదరగొడుతున్న ఒసిటా ఇహెమ్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu