మమత తరపున ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధ, గురు వారాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం జార్గాం, హల్దియాల్లో.. ఎల్లుండి ఖరగ్‌పూర్‌, కోల్‌కతాలో ప్రచారంలో పాల్గొంటారు. తొలి దశలో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల సందర్భంగా విశాఖలో టీడీపీ నిర్వహించిన ప్రచార సభకు తృణమూల్‌ కాంగ్రెస్‌ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:24 pm, Tue, 7 May 19
మమత తరపున ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధ, గురు వారాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం జార్గాం, హల్దియాల్లో.. ఎల్లుండి ఖరగ్‌పూర్‌, కోల్‌కతాలో ప్రచారంలో పాల్గొంటారు. తొలి దశలో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల సందర్భంగా విశాఖలో టీడీపీ నిర్వహించిన ప్రచార సభకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరై ఆ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న విషయం విదితమే. ఇప్పటికే కర్ణాటకలోని జేడీఎస్‌కు మద్దతుగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.