తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడిని నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్లు ఇవే..
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని..

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ డైరెక్టర్ జనరల్ హరిప్రీత్ సింగ్ ను పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
ఈ శాసన మండలి ఎన్నికకు సంబంధించిన ఏదైన విజ్ఞాపనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను ఎన్నికల పరిశీలకులు హరిప్రీత్ సింగ్ కు నేరుగా గాని, వారి మొబైల్ నెంబర్ కు గాని అందించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్న హరిప్రీత్ సింగ్ మొబైల్ నెంబర్ 94406 83720 కు గాను అందించవచ్చు. లేదా ఈ పరిశీలకులకు సమన్వయ అధికారిగా ఉన్న జిహెచ్ఎంసి డిప్యూటి డైరెక్టర్ డా. జె.డి. విల్సన్ మొబైల్ నెంబర్ 97044 56521 కు గాని అందించవచ్చునని రిటర్నింగ్ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ..
పోలింగ్ తేది మార్చి 14
నోటిఫికేషన్/నామినేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 16
నామినేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 23
నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 24
నామినేషన్ల ఉపసంహరణ: ఫిబ్రవరి 26
పోలింగ్ సమయం: ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ఓట్ల లెక్కింపు: మార్చి 16
హైదరాబాద్ స్థానంలో ఓటర్లు 5,21,386
వరంగల్ స్థానంలో ఓటర్లు 4,92,943
Read more: