AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్, బాబులను కడిగిపారేసిన బొత్స.. డైలాగులు అదుర్స్ !

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ కల్యాణ్ మాట్లాడే భాష సరిగ్గా లేదంటూ.. ఆయనలో అహంకారం కనిపిస్తోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడొద్దని, నోరు తమకు, తమ పార్టీ నేతలకు వుందని హెచ్చరించారు బొత్స. పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు బోధన ఉండాలి అని అంటున్నారు.. అది ఓకే కానీ.. ముఖ్యమంత్రి జగన్ మట్టిలో కలిసిపోతారు […]

పవన్, బాబులను కడిగిపారేసిన బొత్స.. డైలాగులు అదుర్స్ !
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 13, 2019 | 5:06 PM

Share

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ కల్యాణ్ మాట్లాడే భాష సరిగ్గా లేదంటూ.. ఆయనలో అహంకారం కనిపిస్తోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడొద్దని, నోరు తమకు, తమ పార్టీ నేతలకు వుందని హెచ్చరించారు బొత్స. పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు బోధన ఉండాలి అని అంటున్నారు..

అది ఓకే కానీ.. ముఖ్యమంత్రి జగన్ మట్టిలో కలిసిపోతారు అని వ్యాఖ్యానించడం దారుణమని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృ భాష పై అందరికి మమకారం ఉంటుందని అన్నారాయన. పవన్ కల్యాణ్‌కు ముగ్గురు భార్యలు అని మాట్లాడితే తప్పేంటని, ఆయన భార్యల గురించి ముఖ్యమంత్రి ఏమీ అనలేదని, కేవలం ఆయన పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారని మాత్రమే ప్రశ్నించారని బొత్స క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

టీడిపి జేనసేన రెండు దొందూ దొందేనంటూ..టీడిపి హయాంలో రెండు పార్టీల నేతలు ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు బొత్స. చంద్రబాబు ఉచిత ఇసుక ఇచ్చారని ప్రజలు చెప్తే నేను తలదించుకుంటానని ఆయన సవాల్ చేశారు. సింగపూర్ స్టార్ట్ ఆప్ ప్రాజెక్ట్ గత కేబినెట్‌లోనే పరస్పర అంగీకారంతో రద్దు చేయాలని నిర్ణయించామని, గత క్యాబినెట్‌లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారయన. రెండు సార్లు నన్ను సింగపూర్ ప్రతినిధులు కలిసి ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి అనేది చెప్పలేకపోయారని చెప్పారు బొత్స.

వేరే ప్రాజెక్ట్‌లో ఏపీ ప్రభుత్వంతో కలిసి మళ్లీ పనిచేస్తామని సింగపూర్ మంత్రి స్వయంగా వెల్లడించిన సంగతి గుర్తు చేశారు బొత్స. సింగపూర్ ప్రభుత్వం రాసిన లేఖను పూర్తిగా చదవకుండానే చంద్రబాబు, లోకేష్ ఆరోపణలు చేస్తున్నారని, ఇంకా ప్రభుత్వం తమదే అన్న భావనలో తండ్రీ కొడుకులు ఉండిపోయారని బొత్స ఎద్దేవా చేశారు. సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టులో ఇప్పటి వరకు జరిగిన ఖర్చును ఆడిట్ చేయిస్తామని ఆయన వెల్లడించారు.

ప్రజలు హింసకు గురయ్యారు కాబట్టే చంద్రబాబుకు ప్రజలు 23 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. చేసిన అన్ని వాగ్దానాలు పూర్తి చేసే పనిలో జగన్ నిమగ్నమై ఉన్నారని, 25 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పిన అన్ని మాటలను నెరవేరుస్తూ జగన్ ముందుకు వెళుతున్నారని బొత్స అన్నారు. టీడిపి ఛార్జ్‌షీట్‌లో విజయనగరం జిల్లాలో ఇసుక మాఫియా అంటూ అసత్యాలు పేర్కొన్నారని, దాన్ని నిరూపించాలని వారికి ఛాలెంజ్ చేస్తున్నానని బొత్స వ్యాఖ్యానించారు.