మంత్రులకు జగన్ స్పెషల్ క్లాస్.. మేటరేంటంటే ?
బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో అధికారులు వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా ముచ్చటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భేటీ ముగిసిన తర్వాత లేచి వెళ్ళి పోయేందుకు సిద్దమైన మంత్రులను కాసేపుండమని చెప్పిన జగన్.. పలు అంశాలపై వారితో మనసు విప్పి మాట్లాడినట్లు పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ మంత్రి చెబుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ అవినీతిని పూర్తిగా నిర్మూలించ గలిగామని ముఖ్యమంత్రి సహచర మంత్రులతో అన్నట్లు సమాచారం. అయితే.. రాజకీయ అవినీతి తగ్గిపోయినప్పటికీ […]
బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో అధికారులు వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా ముచ్చటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భేటీ ముగిసిన తర్వాత లేచి వెళ్ళి పోయేందుకు సిద్దమైన మంత్రులను కాసేపుండమని చెప్పిన జగన్.. పలు అంశాలపై వారితో మనసు విప్పి మాట్లాడినట్లు పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ మంత్రి చెబుతున్నారు.
రాష్ట్రంలో రాజకీయ అవినీతిని పూర్తిగా నిర్మూలించ గలిగామని ముఖ్యమంత్రి సహచర మంత్రులతో అన్నట్లు సమాచారం. అయితే.. రాజకీయ అవినీతి తగ్గిపోయినప్పటికీ అధికారుల్లో అవినీతి రాజ్యమేలుతోందని మంత్రులు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ప్రభుత్వంపై కరెప్షన్ ముద్ర ఎంత మాత్రం పడడానికి వీల్లేదని సీఎం జగన్ ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. అధికారుల్లో అవినీతి నిర్మూలన అవసరమని, లేకపోతే అది ప్రభుత్వంపై మచ్చ తెస్తుందని ముఖ్యమంత్రి అన్నట్లు మంత్రులు చెబుతున్నారు. కింది స్థాయిలో అవినీతి నిర్మూలించబడితేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అభిప్రాయపడినట్లు సమాచారం.
మంగళవారం జరిగిన ఓ రివ్యూ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయంపై మంత్రులు ఈ సందర్భంగా సీఎంను క్లారిటీ అడిగినట్లు తెలుస్తోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం మంచిదే అయినా ప్రస్తుతం కొనసాగుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించ వద్దని మంత్రులు సీఎంను కోరినట్లు చెబుతున్నారు. సుదీర్ఘ కాలం నుంచి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సర్వీసుల్లో ఉన్న వారిని కదిలించవద్దని మంత్రులు చేసిన సూచనపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూనే.. 50 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారని మంత్రులు చెప్పుకుంటున్నారు.