ఇసుక కట్టడికి యాక్షన్ ప్లాన్.. జగన్ సర్కార్ డెసిషన్ ఇదే !
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయాలు అవసరమని కేబినెట్ భావించింది. అందుకు అనుగుణంగా పలు నిర్ణయాలను తీసుకుంది. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎవరైనా లెక్కాపత్రం లేకుండా ఇసుకను తరలిస్తే రెండేళ్లు జైలుశిక్ష, రెండు లక్షల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయాలు అవసరమని కేబినెట్ భావించింది. అందుకు అనుగుణంగా పలు నిర్ణయాలను తీసుకుంది. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎవరైనా లెక్కాపత్రం లేకుండా ఇసుకను తరలిస్తే రెండేళ్లు జైలుశిక్ష, రెండు లక్షల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇటు మొక్కజొన్న ధరలు పడిపోవడంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారు. బుధవారం జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే :
* ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కేబినెట్ ఆమోదం
* అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా
* ఇంగ్లీష్ మీడియం బోధనకు ఏపీ కేబినెట్ ఆమోదం
* ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలొ బోధన
* మాతృభాష తప్పనిసరిగా ఉంటుంది
* తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా చదవాలి
* మొక్క జొన్నకు మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం
* అందుబాటులో ప్రతిరోజూ రెండు లక్షల టన్నుల ఇసుక
* పదిరోజుల్లో అవసరానికి తగ్గట్టుగా సరఫరా చేయాలని నిర్ణయం
* పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించేందుకు ప్రణాళిక
* పారిశ్రామిక వ్యర్థాలపై ఆడిట్ నిర్వహణ
* ఏపీ పర్యావరణ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు