దీక్షకు ముందు బాబుకు షాక్.. సర్కార్ వ్యూహమిదేనా ?
ఏపీలో ఇసుక రగడ తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాధినేత జగన్ తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఎదురు దాడికి దిగుతున్నారు. గతంలో జరిగిన ఇసుక అక్రమాలను పూర్తిగా అరికట్టే వరకు ఆగేది లేదని జగన్ చాటుతున్నారు. ఈ క్రమంలో గురువారం విజయవాడలో 12 గంటల నిరాహార దీక్షకు సిద్దమయ్యారు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. అయితే.. ఈ దీక్ష సమయంలోనే చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చేందుకు ప్రభుత్వం, వైసీపీ పార్టీ […]
ఏపీలో ఇసుక రగడ తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాధినేత జగన్ తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఎదురు దాడికి దిగుతున్నారు. గతంలో జరిగిన ఇసుక అక్రమాలను పూర్తిగా అరికట్టే వరకు ఆగేది లేదని జగన్ చాటుతున్నారు. ఈ క్రమంలో గురువారం విజయవాడలో 12 గంటల నిరాహార దీక్షకు సిద్దమయ్యారు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. అయితే.. ఈ దీక్ష సమయంలోనే చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చేందుకు ప్రభుత్వం, వైసీపీ పార్టీ రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
2014-2019 మధ్య కాలంలో ఏపీవ్యాప్తంగా ఇసుక రీచ్‌లపై తెలుగుదేశం నాయకులు పెద్దరికం చేసి, ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమని చాటే ఓ నిఘా తరహా ఆపరేషన్ వివరాలను తేటతెల్లం చేయడం ద్వారా చంద్రబాబుకు దీక్షా సమయంలోనే షాకిచ్చేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నేతల బినామీ సంస్థగా భావిస్తున్న వైజాగ్ బ్లూ ఫ్రాగ్ అనే మొబైల్ టెక్నాలజీ కంపెనీపై ఏపీ సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
గతంలో ఈ సంస్థ వేదిక ఇసుక అక్రమాలు జరిగాయని, ప్రస్తుతం లేని ఇసుక కొరతను సృష్టించేందుకు బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ ప్రభుత్వ సర్వర్‌ను హ్యాక్ చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరదల కారణంగానే ఇసుక తరలింపు సాధ్యం కాలేదని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ కొందరు కావాలనే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేందుకు కృత్రిమ కొరత సృష్టించారని తాజాగా తెలుస్తుంది. ఈ తతంగం బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ నుంచి జరిగిందని గుర్తించిన సిఐడి అధికారులు స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఏ స్థాయిలో ఇసుక కొరతను సృష్టించారు..? తద్వారా ఎవరికి బెనిఫిట్ జరిగింది ? అనే కోణంలో సిఐడి దర్యాప్తు కొనసాగుతోందని, గురువారం చంద్రబాబు దీక్ష కొనసాగుతున్న సమయం వరకు అక్రమార్కుల గుట్టు బట్టబయలు చేస్తామని కొందరు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ కుట్రలో తెలుగుదేశం నేతల హస్తం బయటపడితే.. చంద్రబాబుకు దీక్షా సమయంలో ఎంబర్రాసింగ్ తప్పదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.