AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: రెండు‌ సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం.. 317జోఓను రద్దు చేస్తాం.. బాధపడకండీ..

రెండు‌ సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. 317జోఓను రద్దు చేస్తుందని.. ఎవరూ బాధపడొద్దన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్.  317 జీవోకు నిరసనగా బీజేపీ ఆధ్వరంలో..

Bandi Sanjay: రెండు‌ సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం.. 317జోఓను రద్దు చేస్తాం.. బాధపడకండీ..
Sanjay Kasula
|

Updated on: Jan 11, 2022 | 6:30 PM

Share

Bandi Sanjay – BJP: రెండు‌ సంవత్సరాల్లో బీజేపీ(BJP) ప్రభుత్వం వస్తుందని.. 317జోఓను రద్దు చేస్తుందని.. ఎవరూ బాధపడొద్దన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay).  317 జీవోకు నిరసనగా బీజేపీ ఆధ్వరంలో మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. 317 జీవోను సవరించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీనియర్, జూనియర్స్ మధ్య కొట్లాట పెట్టడం సరికాదన్నారు. స్థానికతను పక్కన పెట్టి.. షహనాజ్ బేగం అనే సోదురి దివ్యాంగురాలు ఆమెను వనపర్తి కి బదిలీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. టీచర్లు, ఉద్యోగులు ఏం తప్పు చేశారని.. ఎవరి కోసం ఈ జీఓ జారీ చేప్పాలన్నారు.

ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్లమెంటు ‌సభ్యుడిగా దీక్ష చేస్తే దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అరెస్టు చేసినా ఫర్వాలేదన్నారు. తనను తాను కాపాడుకోవడం కోసం కమ్యూనిస్టు, ఎంఐఎం, కాంగ్రెస్‌తో కలుస్తున్నారని విమర్శించారు.

ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రం లో బిజెపి ని అధికారంలోకి‌ తీసుకు రావడమే లక్ష్యంగా పెట్టుకునారని అన్నారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ కామెంట్స్…

అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులను భయపెడుతున్నారని మండిపడ్డారు. స్థానికత అంశం లేకుండా జీఓ తీసుకొచ్చారని.. తొమ్మిది మంది చనిపోతే ప్రభుత్వానికి చలనం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అధికారం వచ్చిన వెంటనే.. 317 జిఓను సవరిస్తామన్నారు. నదులకు నడక నేర్పినం అని చెప్పుకుంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద చుక్క నీరు ఇవ్వలేదంటూ వివమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి: Paritala Sunita: నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా.. కీలక ప్రకటన చేసిన పరిటాల సునీత..

Ration Card: మీకు తెలుసా ఈ విషయం.. రేషన్ కార్డులో మీ పేరు ఉందో.. లేదో.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు..