Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Election 2022: ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్.. ఎస్పీలో చేరిన ఆ పార్టీ మంత్రి..

అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు.

UP Assembly Election 2022: ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్.. ఎస్పీలో చేరిన ఆ పార్టీ మంత్రి..
Swami Prasad Maurya, Akhilesh Yadav
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 11, 2022 | 6:34 PM

Uttar Pradesh Assembly Election 2022: అసెంబ్లీ ఎన్నికల (UP Assembly Election 2022) ముందు ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(BJP)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. ఈ విషయాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బీజేపీలో కీలక ఓబీసీ నేతగా పేరున్న స్వామి ప్రసాద్ మౌర్య నిన్ననే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. యోగి సర్కార్‌లో ఓబీసీ, దళితులు, యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు.

అయితే.. స్వామి ప్రసాద్‌ మౌర్య తన రాజీనామా లేఖలో ఇలా పేర్కొన్నారు. “భిన్నమైన భావజాలం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో అంకితభావంతో పనిచేశాను. కానీ దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్ర అణచివేతకు గురవుతున్నందున రాజీనామా చేస్తున్నాను” అంటూ స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నేను పార్టీ వీడటం బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తెలస్తుందని అభిప్రయా పడ్డారు.

రాజీనామా చేసిన వెంటనే, SP చీఫ్ మరియు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్విట్టర్‌లోకి వెళ్లి మౌర్యను పార్టీలోకి స్వాగతిస్తున్న ఫోటోను పంచుకున్నారు.

అఖిలేష్ యాదవ్ ఇలా రాశారు, “సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం పోరాడిన ప్రముఖ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య జీ మరియు ఇతర నాయకులకు, పార్టీలోని కార్యకర్తలకు హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు! సామాజిక న్యాయం కోసం విప్లవం ఉంటుంది, మార్పు వస్తుంది.”

ఇక స్వామి రాజీనామా తర్వాత యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు.  తొందరపాటు నిర్ణయాలు చాలాసార్లు తప్పు అని రుజువయ్యాయని అభిప్రాయ పడ్డారు. మరోసారి పార్టీ నాయకులతో చర్చలు జరపాలని మాజీ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.

బీజేపీ కంటే ముందు బీఎస్పీలో..

ఉత్తరప్రదేశ్‌లో ఓబీసీలో బలమైన నేతగా పేరున్న స్వామి ప్రసాద్‌ మౌర్య 2016లో బీఎస్పీ నుంచి బీజేపీలో చేరారు. ఇప్పుడు మరోసారి పార్టీ మారారు. సరిగ్గా ఎన్నికల ముందు సమాజ్‌వాదీ పార్టీలో   చేరారు. ఇదిలావుంటే మంత్రి ధరమ్‌సింగ్ సైనితోపాటు మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీ వీడి ఎస్పీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Paritala Sunita: నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా.. కీలక ప్రకటన చేసిన పరిటాల సునీత..

Ration Card: మీకు తెలుసా ఈ విషయం.. రేషన్ కార్డులో మీ పేరు ఉందో.. లేదో.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు..