AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బౌలింగ్ తో కాదు కంటి చూపుతోనే ముంబై కెప్టెన్ కు వార్నింగ్ ఇచ్చిన గుజరాత్ బుల్లోడు! వీడియో వైరల్

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఆసక్తికర ఘర్షణకు వేదికైంది. హార్దిక్ పాండ్యా, సాయి కిషోర్ మధ్య మాటల యుద్ధం జరగగా, కంటి చూపుతోనే వార్నింగ్ ఇచ్చుకోవడం వైరల్‌గా మారింది. అయితే, మ్యాచ్ తర్వాత ఇద్దరూ స్నేహపూర్వకంగా హగ్ చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Video: బౌలింగ్ తో కాదు కంటి చూపుతోనే ముంబై కెప్టెన్ కు వార్నింగ్ ఇచ్చిన గుజరాత్ బుల్లోడు! వీడియో వైరల్
Hardik Sai Kishore
Follow us
Narsimha

|

Updated on: Mar 30, 2025 | 2:03 PM

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. మైదానంలో గట్టి పోటీ నడుస్తుండగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ మధ్య మాటల యుద్ధం జరిగి, అది వైరల్‌గా మారింది. ఒకరికొకరు సీరియస్‌గా తారసపడటమే కాకుండా, కంటి చూపులతోనే వార్నింగ్ ఇచ్చుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వీరి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను చూసి ఫీల్డ్ అంపైర్ తక్షణమే స్పందించి, వారిని శాంతింపజేశాడు.

ఈ ఘర్షణ 15వ ఓవర్లో చోటుచేసుకుంది. సాయి కిషోర్ వేసిన ఓవర్లో హార్దిక్ పాండ్యా ఫైన్ లెగ్ దిశగా బౌండరీ కొట్టాడు. ఆ మరుసటి బంతిని హార్దిక్ డిఫెన్స్ చేసినప్పుడు, బంతి బౌలర్ వైపే కొంత దూరం వెళ్లి ఆగింది. హార్దిక్ పాండ్యా దూసుకొచ్చినట్లుగా సాయికిషోర్‌పై చూస్తూ నిలబడ్డాడు. కానీ, సాయి కిషోర్ కూడా వెనుకంజ వేయకుండా ధీటుగా బదులిచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు నిలబడి చూస్తుండగానే, అంపైర్ వెంటనే వచ్చి వారిని వేరు చేశారు. హార్దిక్ పాండ్యా సైగ చేస్తూ దూరంగా వెళ్లిపోయాడు.

ఈ ఘర్షణతో మ్యాచ్ వేడెక్కినా, మ్యాచ్ ముగిసిన తర్వాత గట్టిగా నవ్వుతూ హార్దిక్ పాండ్యా, సాయి కిషోర్ ఒకరినొకరు హగ్ చేసుకోవడం అభిమానులను ఊహించలేని విధంగా ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఇద్దరూ స్నేహపూర్వకంగా ముచ్చటించుకున్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన సాయి కిషోర్, తాను హార్దిక్ పాండ్యా మంచి స్నేహితులమే అని తెలిపారు. మైదానంలో మాత్రం ఇద్దరూ ప్రత్యర్థులుగా పోరాడతామని, కానీ ఆటలో జరిగే ఘటనలను వ్యక్తిగతంగా తీసుకోమని అన్నారు. “హార్దిక్ నాకు మంచి స్నేహితుడు. మైదానంలో కఠినంగా పోరాడతాం, కానీ ఆ కోపం అక్కడే మర్చిపోతాం. ఆటలో జరిగే ఘట్టాలను వ్యక్తిగతంగా తీసుకోం” అని సాయి కిషోర్ పేర్కొన్నాడు.

గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (63 పరుగులు – 41 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు), శుభ్‌మన్ గిల్ (38 పరుగులు – 27 బంతుల్లో), జోస్ బట్లర్ (39 పరుగులు – 24 బంతుల్లో) జట్టును ముందుండి నడిపించారు.

ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా (2/29) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. అలాగే, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, సత్యనారాయణ రాజు తలో వికెట్ తీసి తమ బాధ్యతను నెరవేర్చారు.

అనంతరం, ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేసి ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్ (48 పరుగులు – 28 బంతుల్లో, 4 సిక్సులు), తిలక్ వర్మ (39 పరుగులు – 36 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే కొంత మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. కానీ, గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీసి, కగిసో రబడా, సాయి కిషోర్ తలో వికెట్ తీసి గుజరాత్ విజయాన్ని ఖాయం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అధిక భద్రత.. మంచి రాబడి.. మహిళలకు ఈ పథకాలు బెస్ట్..!
అధిక భద్రత.. మంచి రాబడి.. మహిళలకు ఈ పథకాలు బెస్ట్..!
పాలు తేనెను కలిపి తీసుకోవడం మంచిదేనా?
పాలు తేనెను కలిపి తీసుకోవడం మంచిదేనా?
అక్షయ తృతీయ రోజున కుబేరుడిని ఈ దిశలో పెట్టండి భోగభాగ్యాలు మీసొంతం
అక్షయ తృతీయ రోజున కుబేరుడిని ఈ దిశలో పెట్టండి భోగభాగ్యాలు మీసొంతం
కెనడా ఎన్నికల్లో ఖలిస్తానీవాదులకు బిగ్ షాక్!
కెనడా ఎన్నికల్లో ఖలిస్తానీవాదులకు బిగ్ షాక్!
ఇంటర్, డిగ్రీ అర్హతతో ఏపీ CID నిఘా విభాగంలో ఉద్యోగాలు.. నో ఎగ్జాం
ఇంటర్, డిగ్రీ అర్హతతో ఏపీ CID నిఘా విభాగంలో ఉద్యోగాలు.. నో ఎగ్జాం
జియో యూజర్లకు బంపర్ ఆఫర్..తక్కువ ధరలో 200 రోజుల చెల్లుబాటు ప్లాన్
జియో యూజర్లకు బంపర్ ఆఫర్..తక్కువ ధరలో 200 రోజుల చెల్లుబాటు ప్లాన్
అక్షయ తృతీయ రోజున మీ ఫ్యామిలీ మెంబర్స్‏ను ఇలా సర్ ప్రైజ్ చేయండి..
అక్షయ తృతీయ రోజున మీ ఫ్యామిలీ మెంబర్స్‏ను ఇలా సర్ ప్రైజ్ చేయండి..
తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్