DC vs SRH Highlights, IPL 2025: వైజాగ్‌లో భంగపడిన హైదరాబాద్.. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th Match Highlights in Telugu: ఐపీఎల్-18లో 10వ మ్యాచ్‌లో భాగంగా విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ, ఈ నిర్ణయం తప్పని నిరూపితమైంది. 13 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. అనికేత్ వర్మ, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ క్రీజులో ఉన్నారు.

Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th Match Highlights in Telugu: కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బలమైన ప్రదర్శన కొనసాగుతోంది. చివరి ఓవర్లో మొదటి మ్యాచ్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఢిల్లీ విజయంలో స్టార్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించారు. 35 సంవత్సరాల వయసులో 5 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ను కోలుకోని దెబ్బ తీశాడు. 40 ఏళ్ల బ్యాట్స్‌మన్ ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించడం ద్వారా 164 పరుగుల లక్ష్యాన్ని సులభతరం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(కీపర్), కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్: కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వి, డోనోవన్ ఫెర్రీరా త్రిపురాణ విజయ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్: సచిన్ బేబీ, ఎషాన్ మలింగ, సిమర్‌జీత్ సింగ్, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్.
LIVE Cricket Score & Updates
-
ఢిల్లీ ఘన విజయం..
హైదరాబాద్ విధించిన టార్గెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
-
కేఎల్ రాహుల్‌ను బౌల్డ్ చేసిన జీషన్
12వ ఓవర్లో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ఇక్కడ కేఎల్ రాహుల్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను జీషన్ అన్సారీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
-
-
26 బంతుల్లో అర్ధ సెంచరీ.. ఆపై ఔట్
9వ ఓవర్లో ఫాఫ్ డు ప్లెసిస్ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆన్సారీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
పవర్ ప్లేలో ఢిల్లీ దూకుడు
164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ జట్టుకు శుభారంభం లభించింది. 6 ఓవర్లలో ఢిల్లీ జట్టు వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది.
-
ఢిల్లీ దూకుడు
3 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. జాక్ ఫ్రేజర్ మాగార్క్, ఫాఫ్ డు ప్లెసిస్ క్రీజులో ఉన్నారు.
-
-
163కే హైదరాబాద్ ఆలౌట్
18.4 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 163 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ జట్టుకు 164 పరుగుల టార్గెట్ లభించింది.
-
అనికేత్ వర్మ ఔట్..
16వ ఓవర్లో హైదరాబాద్ 8వ వికెట్ కోల్పోయింది. అనికేత్ వర్మ 41 బంతుల్లో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జాక్ ఫేజర్-మెక్‌గుర్క్ చేతికి చిక్కాడు.
-
అనికేత్ హాఫ్ సెంచరీ
అనికేత్ వర్మ 14వ ఓవర్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అదే ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ పాట్ కమ్మిన్స్‌కు పెవిలియన్ దారి చూపించాడు.
-
ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
12వ ఓవర్ చివరి బంతికి హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది. అభినవ్ మనోహర్ (4 పరుగులు) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
-
క్లాసెన్ ఔట్..
అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ 8వ ఓవర్లో యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 32 పరుగులు చేసిన క్లాసెన్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.
-
పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టుకు ఆరంభం నుంచే ఒత్తిడిలో కూరుకపోయింది. 6 ఓవర్లలో మైదరాబాద్ జట్టు 4 వికెట్లకు 58 పరుగులు చేసింది. అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నారు.
-
నితీష్ కూడా ఔట్
2.3 ఓవర్లలో హైదరాబాద్ మూడు వికెట్లకు 25 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి (0) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది.
-
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
2.1 ఓవర్లలో హైదరాబాద్ రెండు వికెట్లకు 20 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నాడు. ఇషాన్ కిషన్ (2 పరుగులు) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
-
అభిషేక్ రనౌట్
తొలి ఓవర్లోనే హైదరాబాద్ వికెట్ కోల్పోయింది. ఇక్కడ అభిషేక్ శర్మ జీరోకే రనౌట్‌గా వెనుదిరిగాడు. స్టార్క్ వేసిన ఈ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్
సచిన్ బేబీ, ఎషాన్ మలింగ, సిమర్‌జీత్ సింగ్, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్.
-
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్:
కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వి, డోనోవన్ ఫెర్రీరా త్రిపురాణ విజయ్.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
-
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI:
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(కీపర్), కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.
-
టాస్ రిపోర్ట్..
టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చేయనుంది.
-
వాతావరణ పరిస్థితి..
విశాఖపట్నంలో ఆదివారం వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. రోజంతా ప్రకాశవంతమైన సూర్యకాంతి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 27 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. గాలి వేగం గంటకు 19 కిలోమీటర్లుగా ఉంటుంది.
-
హెడ్ టూ హెడ్ రికార్డులు..
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. హైదరాబాద్ 13 మ్యాచ్‌ల్లో, ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
-
పిచ్ రిపోర్ట్..
విశాఖపట్నం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. విశాఖపట్నంలో ఇప్పటివరకు 16 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 8 సందర్భాలలో గెలిచింది. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు 8 సందర్భాలలో గెలిచింది.
-
వైజాగ్‌లో హోరాహోరీ పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతుంది.
Published On - Mar 30,2025 2:29 PM




