DC vs SRH, IPL 2025: వైజాగ్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా మాన్‌స్టర్..
Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక మార్పు జరిగింది. సిమర్‌జీత్ స్థానంలో జీషన్ అన్సారీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పు చేసింది. సమీర్ రిజ్వీ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు.

DC vs SRH, IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాట్ కమ్మిన్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. విశాఖపట్నం మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో బరిలోకి సిద్ధమైంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమితో వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం కోసం ఎదురుచూస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. సిమర్‌జీత్ స్థానంలో జీషన్ అన్సారీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పు చేసింది. సమీర్ రిజ్వీ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు.
🚨 Toss 🚨@SunRisers won the toss and elected to bat first against @DelhiCapitals in Match 1⃣0⃣
Updates ▶️ https://t.co/L4vEDKyVsb#TATAIPL | #DCvSRH pic.twitter.com/VuIzoiYCjf
— IndianPremierLeague (@IPL) March 30, 2025
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(కీపర్), కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్: కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వి, డోనోవన్ ఫెర్రీరా త్రిపురాణ విజయ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్: సచిన్ బేబీ, ఎషాన్ మలింగ, సిమర్‌జీత్ సింగ్, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..