Video: ఇలా ఎవరైనా ఔట్ అవుతారా అభిషేక్.. గల్లీ ప్లేయర్లే నయం.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్
Abhishek Sharma Run Out: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయం తప్పని నిరూపితమైంది. తొలి ఓవర్‌లోనే హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అభిషేక్ శర్మ తన నిర్లక్ష్యంతో వికెట్ సమర్పించుకున్నాడు.

Abhishek Sharma Run Out: గత సీజన్‌లో సంచలనంగా మారిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ.. ఐపీఎల్ 2025లోనూ అదే దూకుడు కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ, టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఈ ఏడాది తొలి గేమ్ నుంచి నిరాశ పరుస్తూనే ఉన్నాడు. తాజాగా మూడో మ్యాచ్‌లోనూ అదే కంటిన్యూ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో అభిషేక్ గల్లీ ప్లేయర్‌లా ప్రవర్తించి, జీరోకే వికెట్ సమర్పించుకున్నాడు. ఈ రనౌట్‌పై సోషల్ మీడియాలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
విశాఖపట్నంలో తమ రెండో మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాలనే ఉద్దేశ్యంతో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ రనౌట్ అయి పెవిలియన్‌కు తిరిగి రావడంతో తొలి ఓవర్‌లోనే హైదరాబాద్ ఆశలు అడియాసలయ్యాయి. వికెట్ పడిపోయిన విధానంతో సెన్సేషన్ జోడీ హెడ్, అభిషేక్ శర్మల అవగాహనపై ప్రశ్నలను లేవనెత్తేలా చేసింది. ఎందుకంటే ఇద్దరూ పరుగెత్తడంలో గల్లీ ప్లేయర్లలా ప్రవర్తించారు.
SRH ನ ಮೊದಲ ವಿಕೆಟ್ ಪತನ 👏
ರನ್ ಔಟ್ ಮೂಲಕ Abhishek Sharma ತಮ್ಮ ವಿಕೆಟ್ ಕೈಚೆಲ್ಲಿದ್ದಾರೆ 👀
📺 ವೀಕ್ಷಿಸಿ | TATA IPL 2025 | #DCvSRH | LIVE NOW | ನಿಮ್ಮ JioHotstar & Star Sports ಕನ್ನಡದಲ್ಲಿ.#IPLOnJioStar #IPL2025 #TATAIPL pic.twitter.com/tKwl18nYPF
— Star Sports Kannada (@StarSportsKan) March 30, 2025
తప్పుల మీద తప్పులు..
ఢిల్లీ తరపున మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్ వేశాడు. తన ఓవర్లో, ట్రావిస్ హెడ్ వరుసగా 2 ఫోర్లు కొట్టాడు. తద్వారా జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. కానీ, ఆ తర్వాత, ట్రావిస్ హెడ్ ఆ ఓవర్‌లోని ఐదవ బంతికి ఎల్బీ నుంచి తృటిలో తప్పించుకున్నాడు. బంతి అతని బ్యాట్‌కు తగిలి, ఆ తర్వాత అతని ప్యాడ్‌కు తగిలింది. దీనిపై హెడ్ సింగిల్ కోసం పరిగెత్తాడు. అభిషేక్ శర్మ దీనికి సిద్ధంగా లేడు. అతను హెడ్‌ను ఆపడానికి చేయి పైకెత్తాడు. కానీ, హెడ్ దృష్టంతా అభిషేక్‌పై కాకుండా బంతిపైనే పెట్టేశాడు. అభిషేక్‌ను గమనించకుండా ముందుకు కదిలాడు. ఫలితంగా అభిషేక్ ఆలస్యంగా పరిగెత్తడం ప్రారంభించాడు. ఢిల్లీ ఫీల్డర్ విప్రజ్ నిగమ్ నేరుగా స్టంప్స్‌ను గురిచూసి బంతిని విసిరాడు. దీంతో అభిషేక్ శర్మ రనౌట్ అయ్యాడు. అభిషేక్ కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు.
అభిషేక్ నిర్లక్ష్యం..
అభిషేక్ చేసిన ఓ చిన్న తప్పు హైదరాబాద్ జట్టుకు శాపంలా మారింది. అతను చురుగ్గా ఉంటే ఒక పరుగు పూర్తి చేసేవాడు. కానీ, అప్రమత్తంగా లేకపోవడంత, తన భాగస్వామికి సరైన సిగ్నల్ ఇవ్వకపోవడంతో వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఢిల్లీకి వికెట్ ఉచితంగా లభించిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..