DC vs SRH, IPL 2025: మిచెల్ స్టార్క్ పాంచ్ పటాకా.. 163 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్
Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th Match: టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టుకు ఈ నిర్ణయం అంతగా కలసిరాలేదు. కేవలం 18.4 ఓవర్లలో 163 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది హైదరాబాద్ జట్టు. పవర్ ప్లేలోనే హైదరాబాద్ జట్టు 4 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అభిషేక్ శర్మ (0), నితీష్ కుమార్ రెడ్డి (0), ఇషాన్ కిషన్ (2 పరుగులు) సింగిల్ డిజిట్ స్కోరుతో పెవిలియన్‌కు చేరారు.

Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th Match: ఐపీఎల్-18లో భాగంగా 10వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టుకు ఈ నిర్ణయం అంతగా కలసిరాలేదు. కేవలం 18.4 ఓవర్లలో 163 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది హైదరాబాద్ జట్టు. పవర్ ప్లేలోనే హైదరాబాద్ జట్టు 4 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అభిషేక్ శర్మ (0), నితీష్ కుమార్ రెడ్డి (0), ఇషాన్ కిషన్ (2 పరుగులు) సింగిల్ డిజిట్ స్కోరుతో పెవిలియన్‌కు చేరారు. ఇలాంటి కష్ట సమయంలో అనికేత్ వర్మ స్కోరును 150కి దగ్గరగా తీసుకువచ్చాడు. అతను హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి 42 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. అనికేత్ 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతనితో పాటు, హెన్రిచ్ క్లాసెన్ 32 పరుగులు, ట్రావిస్ హెడ్ 22 పరుగులు చేశారు.
ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. మోహిత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు. ఒక బ్యాట్స్‌మన్ రనౌట్ అయ్యాడు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్), జాక్ ఫ్రేజర్-మగార్క్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ట్రిస్టాన్ స్టబ్స్, విపరాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ మరియు ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్స్: కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వి, డోనోవన్ ఫెరీరా, త్రిపురాణ విజయ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, జీషాన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ. ఇంపాక్ట్ ప్లేయర్స్: సచిన్ బేబీ, ఇషాన్ మలింగ, సిమర్జిత్ సింగ్, ఆడమ్ జంపా, వ్యాన్ ముల్డర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..