Andhra Weather: మండే ఎండల వేళ కూల్ న్యూస్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఒడిశా అంతర్గత ప్రాంతం నుండి కొమోరిన్ ప్రాంతం వరకు ఉన్న నిన్నటి ద్రోణి, ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. శనివారం నాటి ఉపరితల ఆవర్తనం మధ్య ఛత్తీస్‌గఢ్ మరియు పరిసర ప్రాంతాలలో తక్కువగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ & యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణము లో దక్షిణ / నైరుతి గాలులు దిశగా వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం...

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమ ఆసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు దొరణిలో మార్పు లేదు .
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది. తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి స్వల్పంగా తగ్గే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
ఆదివారం, సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు దొరణిలో మార్పు లేదు .
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది. తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి స్వల్పంగా తగ్గే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది
రాయలసీమ :-
ఆదివారం, సోమవారం:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశముంది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు దొరణిలో మార్పు లేదు .
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది. తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి స్వల్పంగా తగ్గే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
కాగా ఏప్రిల్ 3 తర్వాత కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని… ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వాతావరణ సూచన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాం మీదుగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ, నైరుతి గాలులు వీచడం వల్ల వాతావరణ పరిస్థితులు ప్రభావితమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..