AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Political War: అవినీతి ఆరోపణలపై ప్రమాణానికి సిద్ధమైన విష్ణు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కాణిపాకంలో హైటెన్షన్‌

ప్రొద్దుటూరులో మొదలైన టెన్షన్‌.. కాణిపాకంలో కాకరేపే వరకు చేరింది. టిప్పుసుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు వివాదం.. కాణిపాకంలో ఉద్రిక్తత రేపుతోంది. బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మధ్య నెలకొన్న...

Political War: అవినీతి ఆరోపణలపై ప్రమాణానికి సిద్ధమైన విష్ణు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కాణిపాకంలో హైటెన్షన్‌
Vishnu Vardhan Reddy
Sanjay Kasula
|

Updated on: Aug 10, 2021 | 10:03 AM

Share

ప్రొద్దుటూరులో మొదలైన టెన్షన్‌.. కాణిపాకంలో కాకరేపే వరకు చేరింది. టిప్పుసుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు వివాదం.. కాణిపాకంలో ఉద్రిక్తత రేపుతోంది. బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మధ్య నెలకొన్న సవాళ్ల పర్వం.. టెన్షన్‌కు కారణంగా మారింది. ప్రొద్దుటూరులో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాలనుకున్న టిప్పుసుల్తాన్‌ విగ్రహంపై వైసీపీ వర్సెస్‌ బీజేపీ అన్నట్టుగా మారింది. దీనిపై రెండు పార్టీల మధ్య మాటకు మాటే కాదు.. సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది.

ఈ క్రమంలో తనపై రాచమల్లు చేసిన అవినీతి ఆరోపణలు నిరాధారమైనవన్న విష్ణువర్దన్‌రెడ్డి.. కాణిపాకంలో సత్యప్రమాణానికి సిద్దమని ప్రకటించారు. తన ప్రమాణానికి ఎమ్మెల్యే రాచమల్లు ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. దీంతో కాణిపాకంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

విష్ణువర్దన్‌రెడ్డి సవాల్‌కు.. ఇంత వరకు రాచమల్లు రియాక్ట్‌ కాలేదు. వస్తానని కానీ, రానని కానీ చెప్పలేదు. దాంతో ముందస్తుగా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. విష్ణువర్ధన్‌రెడ్డి కాణిపాకం చేరుకునేందుకు రెడీ అయ్యారు. కోవిడ్‌ కారణంగా ఆలస్యంలో సత్య ప్రమాణాలను రద్దు చేసినట్టుగా అధికారులు ప్రకటించడంతో.. టెన్షన్‌ రేపుతోంది.

ఇవి కూడా చదవండి:  Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…

Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి

YS Sharmila: ఇవాళ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో షర్మిల దీక్ష.. పోటీపై కీలక ప్రకటనకు ఛాన్స్..