‘నన్ను చంపడానికి బీజేపీ కుట్ర చేస్తోంది’ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ, టీఎంసీని కూడా నాశనం చేస్తుందేమోనని విమర్శ

తనను హతమార్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇదే సమయంలో తమ పార్టీని కూడా నాశనం చేయడానికి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు.

'నన్ను చంపడానికి బీజేపీ కుట్ర చేస్తోంది' బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ, టీఎంసీని కూడా నాశనం చేస్తుందేమోనని విమర్శ
Mamata Banerjee
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 16, 2021 | 6:59 PM

తనను హతమార్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇదే సమయంలో తమ పార్టీని కూడా నాశనం చేయడానికి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు.  బంకూరా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె.. రైతులు ఢిల్లీసరిహద్దుల్లో  ఇన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా వారి  విషయాన్ని పట్టించుకోకుండా బీజేపీ మంత్రులంతా ఇక్కడ ఈ రాష్ట్రంలోని  హోటళ్లలో దిగారని, తనను చంపడానికి, తృణమూల్ కాంగ్రెస్ ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆవేశంగా వ్యాఖ్యానించారు.   ఎన్నికల కమిషన్ సాయంతో మా పార్టీ నేతలు, కార్యకర్తలపై ఎలా కేసులు పెట్టాలా అని వారు యోచిస్తున్నారని ఆమె అన్నారు. తన ర్యాలీలకు జనం ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో హోమ్ మంత్రి అమిత్ షా నిరాశలో మునిగిపోయారని, ఈ నగరంలో కూర్చుని టీఎంసీ కార్యకర్తలపై ఎలా కేసులు పెట్టాలా అని ఆలోచిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ‘వాళ్లకు ఏం కావాలి ? నన్ను చంపగోరుతున్నారా ?  నన్నుహతమార్చడం ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా’ అని మమత ప్రశ్నించారు. అలా అనుకుంటే వారిది తప్పిదమే అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఈసీని అమిత్ షా నిర్వహిస్తున్నారా అన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. వారికి ఆయన  ఆదేశాలు ఇస్తున్నారా అని కూడా ఆమె అన్నారు.

నందిగ్రామ్ లో తనపై దాడి జరిగిందని, అక్కడి ర్యాలీ సందర్భంగా తను గాయపడిన అనంతరం తన సెక్యూరిటీ  డైరెక్టర్ వివేక్ సహాయ్ ని అమిత్ షా ఆదేశాలతోనే ఈసీ  తొలగించిందని మమతా  బెనర్జీ పేర్కొన్నారు. ఇలా ఉండగా… బెంగాల్ బీజేపీ ప్రతినిధి బృందమొకటి నిన్న రాష్ట్రంలో ఎన్నికల అధికారిని కలిసి.. నందిగ్రామ్ నుంచి మమత నామినేషన్ ని తిరస్కరించాలని కోరింది. అటు-ఆమె తన ఎన్నికల అఫిడవిట్ లో తనపై గల 6 క్రిమినల్ కేసుల విషయాన్ని ప్రస్తావించకుండా దాచిపెట్టారని నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువెందు అధికారి ఆరోపించారు. అందువల్ల  ఆమె నామినేషన్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి: Credit Card : ఓ మై గాడ్.. క్రెడిట్ కార్డు వాడకం.. కొకైన్‌కి బానిసవ్వడం ఒక్కటేనట.. షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న..

Employers Provident Fund : UAN నెంబర్ తెలియక పోయినా మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా అంటే..!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?