AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూ నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత..!

కాళేశ్వరం, అనంతగిరి, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

భూ నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత..!
supreme court
Balaraju Goud
|

Updated on: Mar 16, 2021 | 7:02 PM

Share

Supreme on High Court: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం, అనంతగిరి, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని, వివాహం కాని మేజర్ యువతీ, యువకులకు సైతం విడిగా నష్ట పరిహారం ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర సర్కార్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వైద్యనాథన్ సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ సారథ్యంలో ధర్మాసనం తెలంగాణ హైకోర్టు హడావిడిగా ఆ విచారణ జరిపినట్లు అభిప్రాయపడింది. ఇలాంటి హడావిడి విచారణలను ఆమోదించలేమని న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తేల్చి చెప్పారు.

గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చిన ఖాన్విల్కర్ ధర్మాసనం భూ సేకరణకు సంబంధించి నష్టపరిహారం కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను మళ్లీ విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ విచారణను స్వయంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే చేపట్టాలని నిర్దేశించింది. అదే సమయంలో దీనిపై పదేపదే వాయిదాలు కోరవద్దని తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Read Also.. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సంబరాలు.. 75 వారాల పాటు దేశ స్వాతంత్ర వేడుకలు.. అత్యంత సుందరంగా సబర్మతి ఆశ్రమం