Goa Assembly Polls: ఆ సత్తా, దమ్ము టీఎంసీకే ఉంది.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన మమతా బెనర్జీ

కాంగ్రెస్‌ నేతల పోరాటం ట్విట్టర్‌కే పరిమితం. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడం కాంగ్రెస్‌కు చేతకావడం లేదని తీవ్రంగా విమర్శించింది తృణమూల్‌..

Goa Assembly Polls: ఆ సత్తా, దమ్ము టీఎంసీకే ఉంది.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన మమతా బెనర్జీ
Bengal Cm Mamata Banerjee
Follow us

|

Updated on: Oct 28, 2021 | 8:23 PM

Bengal CM Mamata Banerjee: కాంగ్రెస్‌ నేతల పోరాటం ట్విట్టర్‌కే పరిమితం. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడం కాంగ్రెస్‌కు చేతకావడం లేదని తీవ్రంగా విమర్శించింది తృణమూల్‌ కాంగ్రెస్. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే సత్తా , దమ్ము టీఎంసీకే ఉందంటున్నారు ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ , టీఎంసీ నేతల మధ్య మాటలయుద్దం జరుగుతోంది. బీజేపీని బలోపేతం చేసేందుకు మమతా బెనర్జీ చాలా కృషి చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు టీఎంసీ నుంచి ఘాటైన జవాబు ఇచ్చింది. బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్‌ నాయకత్వానికి చేతకావడం లేదని తీవ్రంగా విమర్శించారు తృణమూల్‌ కాంగ్రెస్ నేతలు. గత కొంతకాలంలో త్రిపుర , గోవా , ఉత్తరప్రదేశ్‌ , అసోం రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ కీలక నేతలు టీఎంసీలో చేరారు.. గోవాలో ఎల్లుండి నుంచి మమత పర్యటన ప్రారంభమవుతుంది. కాంగ్రెస్‌ను బలహీనపర్చడానికి మమత కుట్ర చేశారని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

వ‌చ్చే ఏడాది ప్రారంభంలో గోవా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్రంలో బ‌లోపేతం చేయ‌డం కోసం మ‌మ‌తాబెన‌ర్జి  ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే గురువారం మమతా గోవాకు చేరుకున్నారు. ద‌బోలిమ్‌లోని గోవా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మ‌మ‌త‌కు స్థానిక తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మ‌మ‌తాబెన‌ర్జి మూడు నుంచి నాలుగు రోజుల వ‌ర‌కు గోవాలోనే ఉంటారని తెలుస్తోంది.

ఈసారి ఎలాగైనా గోవాలో అధికారం చేజిక్కించుకోవాల‌ని మ‌మ‌త‌బెన‌ర్జి గట్టి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అందుకే రాష్ట్రంలో నాలుగు రోజులు మ‌కాం వేసి నేత‌ల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలోని నాయకులను చేర్చుకుంటోంది.

ఇవి కూడా చదవండి: Chat Without Internet : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌ చాట్ చేయండి.. ఎలానో తెలుసా..

Prashant Kishor: మరో 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. సమస్యంతా రాహుల్ గాంధీలోనే.. హాట్ కామెంట్ చేసిన పీకే..