AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతిలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పర్యటన.. మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై స్పీడ్‌ పెంచిన ఎస్‌ఈసీ

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్. అప్పుడే స్పీడ్ పెంచారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారాయన. ఇందులోభాగంగా..

తిరుపతిలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పర్యటన.. మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై స్పీడ్‌ పెంచిన ఎస్‌ఈసీ
K Sammaiah
|

Updated on: Feb 27, 2021 | 4:33 PM

Share

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. అప్పుడే స్పీడ్ పెంచారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారాయన. ఇందులోభాగంగా ఇవాళ తిరుపతిలో మధ్యాహ్నం 3గంటలకు పొలిటికల్ పార్టీలతో భేటీకానున్నారు. ఆ తర్వాత కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతోనూ నిమ్మగడ్డ సమావేశం కానున్నారు.

రేపు విజయవాడ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి.. ఎల్లుండి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అధికారులతో నిమ్మగడ్డ భేటీకానున్నారు. పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా చూడాలని.. అలాగే పంచాయతీ ఎన్నికల తరహాలోనే విజయవంతం చేయాలని సూచించనున్నారు. ఈసారి కూడా వెబ్‌క్యాస్టింగ్‌, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జిల్లాల పర్యటన షెడ్యూల్‌:

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటన అధికారికంగా ఖరారయింది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన మేరకు 3 రోజుల్లో వరుసగా 13 జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు ఎస్ఈసీ విమ్మగడ్డ రమేష్ కుమార్. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, సంసిద్ధతపై అధికారులు, రాజకీయ పార్టీలతో చర్చించి దిశానిర్దేశం చేయన్నారు ఎస్ఈసీ.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూడు రోజుల పర్యటనలో భాగంగా 13 జిల్లాల అధికారులు , రాజకీయపార్టీలతో సమావేశాలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ , ఏర్పాట్లు , సంసిద్ధతపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు . తొలిరోజు పర్యటనలో భాగంగా తేది 27.02.2021 న మధ్యాహ్నం 1.15 గం.లకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు చేరుకొని మధ్యాహ్నం 2.15 గం.లకు తిరుపతి చేరుకుంటారు. అనంతరం 3.15 గం.ల నుండి 5.30 గం.ల వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు రాజకీయ పార్టీలతో గంట పాటు సమావేశమవుతారు. మరుసటి రోజు 28.02.2021 వ తేదీన ఉదయం 10.45 గం.లకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి మధ్యాహ్నం 12 గంలకు విజయవాడ చేరుకుంటారు. అనంతరం 3.30 గం.ల నుండి 5.30 గం.ల వరకు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు రాజకీయ పార్టీలతో గంట పాటు సమావేశమవుతారు.

తర్వాతి రోజు 01.03.2021 న మధ్యాహ్నం 12.20 గం.లకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.20 గం.లకు విశాఖ పట్టణం చేరుకుంటారు . అనంతరం 3.15 గం.ల నుండి 5.30 గం.ల వరకు శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్టణం , తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు . అనంతరం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు రాజకీయ పార్టీలతో గంట పాటు సమావేశమవుతారు . సమావేశం ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ విజయవంతమైన ఊపులోనే మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో పుర‌పాలిక ఎన్నిక‌లపై ప్రాంతాల వారీ స‌మావేశాల‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించింది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం స‌న్న‌ద్ధ‌త కోస‌మే ప్రాంతాల వారీ స‌మావేశాల ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించింది.

Read more:

తెలంగాణలో హీట్‌ పెంచిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు