Balineni Srinivasa Reddy: “రైతుల సమస్యలు తీర్చమని అప్పట్లో చంద్రబాబు దగ్గరకు వెళ్తే..” సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని
ఏపీలో రైతు దినోత్సవంపై టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రైతులకు టీడీపీ నేతలు ఏం మేలు చేశారో చెప్పాలని...

ఏపీలో రైతు దినోత్సవంపై టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రైతులకు టీడీపీ నేతలు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 1999లో తాను ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు దగ్గరకు వెళ్ళి.. ప్రకాశం జిల్లా సాగర్ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వాలని కోరితే నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి.. వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలపై విమర్శలు చేయడం ఏంటన్నారు బాలినేని. ప్రకాశం జిల్లాలో ఒక్కసాగునీటి ప్రాజెక్టునైనా టీడీపీ హయాంలో నిర్మించారా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన వెలుగొండ, గుండ్లకమ్మ, రామతీర్ధం రిజర్వాయర్లను.. పూర్తి చేసేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు మంత్రి బాలినేని. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు.. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు మంత్రి బాలినేని.
సర్వేపల్లిలో కాకాణి వెర్సస్ సోమిరెడ్డి
సర్వేపల్లిలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య మళ్లీ మాటల తూటాలు పేలాయి. వ్యవసాయ రంగంపై సోమిరెడ్డికి, కాకానికి మధ్య కామెంట్లు, కౌంటర్లు నడిచాయి. రైతు దినోత్సవం అంటూ వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. రుణమాఫీ పేరుతో పచ్చిమోసం చేసిన టీడీపీ నేతలా మాట్లాడేది అంటూ కౌంటర్ ఇచ్చారు కాకాణి.