Minister Harish Rao: కాంగ్రెస్ ముసుగులో మళ్లీ తెలంగాణలోకి చంద్రబాబు.. మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు..

Minister Harish Rao: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.

Minister Harish Rao: కాంగ్రెస్ ముసుగులో మళ్లీ తెలంగాణలోకి చంద్రబాబు.. మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు..
Harish Rao
Follow us

|

Updated on: Jul 09, 2021 | 3:40 PM

Minister Harish Rao: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన మనుషులకు కాంగ్రెస్‌లో పదవులు ఇప్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో మండల వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే.. ఆంధ్రాబాబు అని ప్రజలు వెళ్లగొట్టారని గుర్తుచేశారు. ఆ కారణంగానే టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబే మళ్లీ కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు తన మనుషులకు పదవులు ఇప్పిస్తున్నారని అన్నారు. ‘‘టీపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఎవరు? ఓటుకు నోటు కేసులో ఉన్నవాళ్లే కదా? చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు పీసీసీ చీఫ్ గా వచ్చాడు’’ అని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ జెండా ఎత్తుకున్నాక.. పొలాల్లో నీళ్లు, ఇంటింటికి తాగునీళ్లు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ నేయని పనిని టీఆర్ఎస్ చేసిందన్నారు. ఏ చెరువు చూసినా నీటితో నిండి ఉన్నాయన్నారు. వానలు ఇంకా రాకముందే.. కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు నిండిపోయాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో క్రాప్ లోన్లు రావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పడిఉండేదని, సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాలు బయటపెట్టకుండా రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని అన్నారు. ఎకరానికి రూ. 5 వేలు.. విత్తనాలు, నాట్లు, నారుమడి వంటి ఖర్చుకోసం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.

రైతులకు, ప్రజలకు బీజేపీ ఏమైనా ఇస్తుందా? అని ప్రజలను మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఏమీ ఇవ్వకపోగా ధరలు మాత్రం విపరీతంగా పెంచి పేదల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 100 కి పెంచిందని విమర్శలు గుప్పించారు. రైతు శ్రేయస్సుకై ఎకరానికి టీఆర్ఎస్ రూ. 5 వేలు ఇస్తే., డీజిల్ ధర పెంచి బీజేపీ రైతుల పైసలు గుంజేసిందన్నారు. ఏడేళ్లలో బీజేపీ దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఏం చేసిందన్నారు. యేడాదిలో 25/26 రూపాయల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని, ఫలితంగా అన్ని ధరలు పెరిగిపోయాయని అన్నారు.

కరోనా కష్టకాలంలోనూ తాము రైతుల‌ నుంచి ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఒక్క గింజ లేకుండా ధాన్యం కొన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యాసంగిలో కొన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆనాడు ఆంధ్రా వాళ్లు వ్యవసాయం రాదని వెక్కిరించారని.. ఈనాడు వాళ్లు అసూయ పడేలా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులు పంజాబ్ పండించగా.. తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో‌ నిలిచి, దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారిందని మంత్రి వెల్లడించారు.

ఇదిలాఉండగా.. బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గ్రామ మహిళా సమాఖ్య భవనాన్ని, కల్లేపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్-అంబేద్కర్ భవనాన్ని, కల్లెపల్లి గ్రామ రైతు వేదికను ప్రారంభించారు. మహిళా భవనాన్ని, అంబేద్కర్ భవనాన్ని, రైతు వేదికను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బెజ్జంకి మండలంలో 16 గ్రామాలలో మహిళా సమాఖ్య భవనాలు నిర్మించామని మంత్రి చెప్పారు. మండలంలో 7 కొత్త గ్రామ పంచాయతీలకు.. కొత్త పంచాయతీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు అడిగారని, ఒక్కో భవనానికి రూ. 25 లక్షల చొప్పున రూ. 1.75 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇక కల్లెపల్లి గ్రామానికి ఫంక్షన్ హాల్‌ను నిర్మించి ఇస్తామన్నారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాకముందు ఎకరం భూమి ధర బెజ్జంకిలో రూ. 4 లక్షలు ఉంటే, రైతు బంధు, కాళేశ్వరం నీరు, ఉచిత‌విద్యుత్ వంటి పథకాల‌వల్ల ఇప్పుడు రూ. 4 లక్షల ఎకరం కాస్తా రూ. 40 లక్షలకు ఎకరం చొప్పున పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. బెజ్జంకిలో మార్కెట్ యార్డు లేకపోతే రూ.20 కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డు, గోదాములు, సబ్ మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. బెజ్జంకి మండలంలో గతంలో గుక్కెడు తాగునీటి కోసం అవస్థలు పడ్డ పరిస్థితి, పంటలు ఎండిపోయే పరిస్థితి, ట్రాన్స్ ఫార్మర్లు పేలుడు, మోటార్లు కాలిపోవడం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత వేసవిలో ఒక్క గుంట కూడా ఎండలేదన్నారు. ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మిడ్ మానేరు నింపి నీళ్లు తెచ్చుకున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Also read:

Viral Video: బావతో మరదలి సరదా.. బాలీవుడ్ పాటకు ఓ రేంజ్‌లో స్టెప్పులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Shocking Video: రోడ్డంతా నాదే.. మందుబాబు డేంజర్ డ్రైవింగ్ విన్యాసాలు చూస్తే షాకే..

Mahasamudram : షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన మహాసముద్రం టీమ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే