AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Roja vs Revanth Reddy: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన రేవంత్ రెడ్డా?.. కోవర్ట్ రెడ్డా? అంటూ..

MLA Roja vs Revanth Reddy: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై టీడీపీ నేతలు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ చేసిన..

MLA Roja vs Revanth Reddy: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన రేవంత్ రెడ్డా?.. కోవర్ట్ రెడ్డా? అంటూ..
Mla Roja
Shiva Prajapati
|

Updated on: Jul 09, 2021 | 11:08 AM

Share

MLA Roja vs Revanth Reddy: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై టీడీపీ నేతలు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. తమ హయాంలో నీటి వివాదాలే లేవని చంద్రబాబు, లోకేష్ అంటున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా, తెలంగాణ పోలీసులు కొట్టుకున్న విషయాన్ని మర్చిపోయారా అని గుర్తు చేశారు. అలాగే రైతు దినోత్సవంపై టీడీపీ నేతలు చేసిన కామెంట్ల పైనా ఆవిడ ఫైర్ అయ్యారు. ‘నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవాన్ని రైతులు ఘనంగా జరుపుకున్నారు. కానీ రైతులను దగా చేసిన ప్రభుత్వమని టీడీపీ నిరసనలు చేయడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. రైతులను దగా చేసిన పార్టీ టీడీపీయే అని రాష్ట్రంలోని రైతులు అందరికీ తెలుసు. టీడీపీ 14 ఏళ్ల పాలనలో రైతులకు ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేశారా? టీడీపీ హయాంలో విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కితే గుర్రాలతో తొక్కించి, తూటాలతో భయపెట్టారు. సిగ్గూ, మానంలేని వారే జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు.’’ అంటూ టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. రూ.83 వేలకోట్లను వివిధ పథకాల ద్వారా రైతులకు అందించిన ఘనత సీఎం జగన్ ది అని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు ఉదయం తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం గుడి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండాల్సిందిపోయి ఓటుకు నోటుకు కేసుతో దొంగల్లాగా పారిపోయి ఆంధ్ర ప్రజలను విజయవాడ నడిరోడ్లపై వదిలింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో రేవంత్ రెడ్డిపైనా ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ’మా ఇంట్లో సీఎం కేసీఆర్, జగన్ ల మంతనాలు జరిగాయని రేవంత్ రెడ్డి అంటున్నారనీ, జగన్ మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో రేవంత్ రెడ్డి నిరూపించాలని’ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు. కేసీఆర్ దైవ దర్శనం కోసం తమిళనాడుకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న మా ఇంటికి వచ్చారే తప్ప ఎలాంటి మంతనాలు జరగలేదని స్పష్టం చేశారు. ఆయన రేవంత్ రెడ్డా, కోవర్ట్ రెడ్డో ముందు చెప్పాలని అన్నారు. పచ్చమీడియాతో కలిసి రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయం చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అని అర్థమవుతోందన్నారు. మీ నాయకుడు చంద్రబాబు 28 రకాల వంటకాలతో కేసీఆర్ కు దగ్గరుండి భోజనం తినిపించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వమేననీ, జలవివాదం పరిష్కరించాల్సింది కేంద్రమే కాబట్టి సీఎం జగన్ ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖ రాశారని చెప్పారు. దేశంలోనే వెనుకబడిన ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చోరవ తీసుకుని విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు ఉన్న వాటాను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. అది తెలీకుండా అనవసరంగా వాగుతున్నవారి విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేస్తున్నానని అన్నారు.

Also read:

Amazon Prime Day: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే..!

Atrocities: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ట్రైన్‌లో నుండి పడిపోయిన ఆరేళ్ల పాప.. కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి!

196 అడుగుల లోతైన స్విమ్మింగ్‌ పూల్‌.. డైవ్ చేస్తే థ్రిల్ అవ్వాల్సిందే.. ఆసక్తి రేపుతోన్న డీప్ డైవ్ దుబాయ్!