AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sepoy Jaswanth Reddy: మరో నెల రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే విషాదం.. జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో తెలుగు జవాన్ వీర మరణం..!

జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా జవాను మృతి చెందారు. నిన్న రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఎదురు కాల్పులు జరిగాయి.

Sepoy Jaswanth Reddy: మరో నెల రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే విషాదం.. జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో తెలుగు జవాన్ వీర మరణం..!
Sepoy Maruprolu Jaswanth Reddy Died In Jammu Kashmir Encounter
Balaraju Goud
|

Updated on: Jul 09, 2021 | 9:45 AM

Share

Sepoy Maruprolu Jaswanth Reddy died in Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా జవాను మృతి చెందారు. నిన్న రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాజోరిలో కూంబింగ్‌ జరుపుతుండగా కాల్పులకు తెగబడ్డారు తీవ్రవాదులు. సుందర్‌బనీ సెక్టార్‌లో జవాన్లు, టెర్రరిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో..ఇద్దరు పాక్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు జవాన్లు.

మరోవైపు ముష్కరమూకలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరుప్రోలు జశ్వంత్‌రెడ్డితో పాటు శ్రీజిత్‌ ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం వాసి మరుపోలు జశ్వంత్‌రెడ్డి (23) ఐదేళ్ల క్రితం సైన్యంలో చేరారు. జశ్వంత్‌రెడ్డి మృతితో దరివాద కొత్తపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి.

బాపట్ల ప్రాంతంలోని దరివాదా కొత్తపాలెం కు చెందిన యువకుడు మారుప్రోలు జస్వంత్ రెడ్డి (23) తండ్రి శ్రీనివాసరెడ్డి,వెంకటేశ్వరమ్మల కుమారుడు. ఇంట్లో సంతోషకరమైన సందడి జరిగి మాసం రోజులు కాకుండానే విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్మీ లాంచనాలతో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహం బాపట్ల చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆరేళ్ళ క్రితం 17 మద్రాస్ ఇన్ఫరెంట్ రెజిమెంట్ 2016 బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకొని మొదట డ్యూటీ నీలగిరిలో చేశారు. అనంతరం జమ్మూకాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెలలో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.

Read Also… Covid-19 Vaccine: టీకా తీసుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం.. కంపెనీలను మూసివేస్తాం.. ఆ దేశం కొత్త రూల్స్‌

Follow Us
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..
టెన్త్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ 2026కు ఫీజు చెల్లింపులు ప్రారంభం
టెన్త్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ 2026కు ఫీజు చెల్లింపులు ప్రారంభం
మే 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగాల్లో శుభవార్తలు..
మే 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగాల్లో శుభవార్తలు..