Covid-19 Vaccine: టీకా తీసుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం.. కంపెనీలను మూసివేస్తాం.. ఆ దేశం కొత్త రూల్స్
Covid-19 Vaccine: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే మరో వైపు డెల్టా వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి
Covid-19 Vaccine: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే మరో వైపు డెల్టా వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ టీకా వేసుకోవాలని సూచిస్తున్నాయి ప్రభుత్వాలు. కొన్ని దేశాలు మాత్రం ఉద్యోగులకు వ్యాక్సిన్ విషయంలో కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. ఉద్యోగులు తప్పనిసరిగా కోవిడ్ టీకా తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఇక దక్షిణ పసిఫిక్ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధనలు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆగస్టు 15వ తేదీ లోపు మొదటి డోసు తీసుకోకపోతే సెలవుపై వెళ్లాలని, నవంబర్ 1లోగా రెండో డోసు తీసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు ఫిజి ప్రధాన మంత్రి ఫ్రాంక్ బైనీమారామ స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగులు ఆగస్టు 1 నాటికి తమ మొదటి డోసు తీసుకుని ఉండాలని, లేకపోతే భారీగా జరిమానాలు, కఠిన చర్యలు ఉంటాయని, అంతేకాకుండా వ్యాక్సినేషన్ కానీ కంపెనీలను మూసివేయబడతాయని హెచ్చరించారు.
కాగా, దక్షిణ పిసిఫిక్ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 340,000 మందికి టీకాలు వేసినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ తీసుకోలేని వారు తప్పకుండా తీసుకోవాలని ఆ దేశం సూచిస్తోంది. కాగా, కోవిడ్ వైరస్ రూపాంతరం చెందుతూ వ్యాప్తి చెందుతున్న తరుణంలో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే కోవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నాయి పలు దేశాలు. రానున్న థర్డ్ వేవ్‌లో మరింత ప్రమాదం పొంచివుండే అవకాశం ఉండటంతో ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసే విధంగా చర్యలు చేపడుతున్నాయి.