AP Governor Quota MLC: గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఆమోదం.. ప్రకటన విడుదల చేసిన రాజ్ భవన్

గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు.

AP Governor Quota MLC: గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఆమోదం.. ప్రకటన విడుదల చేసిన రాజ్ భవన్
Ap Cm Ys Jagan Meets Governor Biswabhushan Harichandan
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 14, 2021 | 7:13 PM

AP Governor Quota Nominated MLC: గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. సీఎం వైఎస్ జగన్ రాజ్ భవన్‌‌లో గవర్నర్‌ను కలవక ముందే జాబితాను అమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తిని మన్నించినందుకు గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌రాజు, రమేశ్‌ యాదవ్‌ పేర్లను ప్రభుత్వం గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లు ఆమోదం తెలపాలని గవర్నర్‌ను సీఎం జగన్ కోరారు. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్సీ పేర్లను గవర్నర్ బిశ్వభూషణ్ ఖరారు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే ఈ నలుగురు శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read Also….  AP CM YS Jagan meets Governor: ఏపీ గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. రెండేళ్ల పరిపాలన, రాష్ట్ర ప్రగతి, నామినేటెడ్ పదవులపై చర్చ..!