పార్టీ కార్యాలయాలపై దాడులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

Somu Veerraju Comments: ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో

పార్టీ కార్యాలయాలపై దాడులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
Somu Veerraju

Somu Veerraju Comments: ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు చాలా విషాదకరమన్నారు. పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దుశ్చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.

అలాగే టీడీపీ ఆఫీసులపై జరిగిన వరుస దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇలాంటి దాడులు రాష్ట్రానికి మంచిది కాదని స్పష్టం చేశారు. అరాచకానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్‌గా మారిందని.. ఇలాంటి పోకడలను వెంటనే నియంత్రించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిది కాదని వెల్లడించారు. ఇలాంటి దాడులు అరాచకాలకు దారి తీస్తాయని.. ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఈ దాడులకు పాల్పడినవారిని వెంటనే శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కోరారు.

ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం, డీజీపీ కలిసి టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై దాడి చేయించారని ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలను ఇప్పటివరకు చూడలేదంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు.

Angry Man: అయ్యయ్యో! భార్య మీద ఆ భర్త కోపం.. పక్కింటి వాళ్లకు శాపం.. ఏం జరిగిందంటే..

Mekathoti Sucharita: డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు.. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. హోంమంత్రి సుచరిత

Meenakshi Chaudhary: కవ్విస్తున్న ‘ఖిలాడి’ బ్యూటీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మీనాక్షి ఫొటోస్..

 

Click on your DTH Provider to Add TV9 Telugu