AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Angry Man: అయ్యయ్యో! భార్య మీద ఆ భర్త కోపం.. పక్కింటి వాళ్లకు శాపం.. ఏం జరిగిందంటే..

తన కోపమే తన శత్రువు.. ఇది అందరికీ తెలిసిందే. కానీ.. ఒక్కోసారి ఆ కోపం పక్కవాళ్ళ కొంపలు కూడా తగల బెట్టేస్తుంది. ఇది నిజం. కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే దాని ఎఫెక్ట్ ఒక్కోసారి మామూలుగా ఉండదు.

Angry Man: అయ్యయ్యో! భార్య మీద ఆ భర్త కోపం.. పక్కింటి వాళ్లకు శాపం.. ఏం జరిగిందంటే..
Amgry Man
KVD Varma
|

Updated on: Oct 19, 2021 | 9:39 PM

Share

Angry Man: తన కోపమే తన శత్రువు.. ఇది అందరికీ తెలిసిందే. కానీ.. ఒక్కోసారి ఆ కోపం పక్కవాళ్ళ కొంపలు కూడా తగల బెట్టేస్తుంది. ఇది నిజం. కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే దాని ఎఫెక్ట్ ఒక్కోసారి మామూలుగా ఉండదు. ఏమిటీ మీకు ఎప్పుడూ ఇలా ఒకరి కోపం పక్కవాళ్ళను ముంచేసిన సంఘటన ఎదురుకాలేదా? అయితే.. ఈ ప్రబుద్ధుడి కోపం కథ వింటే మీకు సరిగ్గా తెలుస్తుంది. తన భార్యతో గొడవపడి కోపం వచ్చి.. దానిని ఆపుకోలేక అతని ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ ఘనుడు. తరువాత ఏమి జరిగిందంటే..ఈయనగారి కోపం మంటలు పక్కనే ఉన్న పది ఇళ్ళను చుట్టుముట్టాయి. కోట్లాది రూపాయల ఆస్తిని బూడిద చేసేశాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారాలోని పటాన్ లో చోటు చేసుకుంది. ఈ ఇళ్లన్నీ దాదాపు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. పోలీసుల ప్రకారం, ఈ అగ్నిప్రమాదం వల్ల కోట్లాది రూపాయల నష్టం జరిగింది. ప్రజలు తమ ఇళ్ల నుండి సరైన సమయంలో బయటకు రావడం ఉపశమనం కలిగించే విషయం. దీంతో వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

మజ్ గావ్ నివాసి అయిన సంజయ్ పాటిల్ సోమవారం మధ్యాహ్నం తన భార్య పల్లవితో గొడవ పడ్డాడు. ఒకరితో ఒకరికి జరిగిన ఈ గొడవ ఎంత ముదిరిందంటే.. సంజయ్ తట్టుకోలేని కోపానికి గురయ్యాడు. దీంతో ఆ కోపంలో అతను పెట్రోల్ చల్లి తన ఇంటికి నిప్పంటించాడు. దీంతో ఆ పెట్రోల్ మంట వేగంగా వ్యాపించింది. ఆ మంటలు సమీపంలోని 10 ఇళ్లను కూడా దహించేశాయి. నిందితుడు సంజయ్ ఇంటి పక్కనే ఉన్న 4 ఇళ్లకు గరిష్ట నష్టం జరిగింది. పోలీసుల ప్రకారం, ఈ ఇళ్లలో ఉంచిన గ్యాస్ సిలిండర్ల కారణంగా అగ్ని తీవ్ర రూపం దాల్చింది. ఈ మంటల తీవ్రత ఎంతలా ఉందంటే.. ఇళ్ళల్లో ఉన్న మనుషులు మాత్రమె బయటకు వచ్చి బతికి బట్ట కట్టారు. ఇంటిలోని సామానులన్నీ బూడిద అయిపోయాయి.

ఈ సంఘటన తర్వాత, పొరుగువారు నిందితుడిని పట్టుకుని చితక బాదేశారు. తరువాత పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్ళి అప్పచెప్పారు. పటాన్ తాలూకాలోని మజ్‌గావ్‌లో జరిగిన ఈ సంఘటన తర్వాత, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. భార్య ఫిర్యాదు చేసింది

పోలీసుల ప్రకారం, ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కానీ సరైన సమయంలో ప్రజలు ఇల్లు వదిలి వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం నిందితుడు సంజయ్ లాకప్‌లో ఉన్నాడు. భార్య కూడా అతడిపై ఫిర్యాదు చేసింది. చూశారా.. కోపం ఎంత పని చేస్తుందో.

Also Read: Health Tips: ఈ పురాతన విధానం సర్వరోగ నివారిణి.. ఇలాచేస్తే..గుండెపోటు..క్యాన్సర్.. డయాబెటిస్..వంటి వ్యాధులు పరార్!

Food Habits: బీ కేర్‌ఫుల్! ఆహారంలో ఈ పదార్ధాలను కలిపి తీసుకుంటే కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్టే..

Senior Citizens: అరవై ఏళ్ళు దాటినా.. అలుపెరుగని పరుగులు.. జపాన్‌లో వృద్ధుల జీవన శైలి అదరహో!