AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: ఒవైసీకి ఓటేసినా.. కాంగ్రెస్‌కు ఓటేసినా అవి బీఆర్ఎస్‌కే వెళ్తాయి.. బీజేపీతోనే తెలంగాణలో మార్పు

Amit Shah Press Meet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న భారతీయ జనతా పార్టీ.. ప్రచార పర్వంలో స్పీడును పెంచింది. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఈ ఎన్నికలు కీలకమని.. మీ ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.

Amit Shah: ఒవైసీకి ఓటేసినా.. కాంగ్రెస్‌కు ఓటేసినా అవి బీఆర్ఎస్‌కే వెళ్తాయి.. బీజేపీతోనే తెలంగాణలో మార్పు
Amit Shah
Shaik Madar Saheb
|

Updated on: Nov 25, 2023 | 11:48 AM

Share

Amit Shah Press Meet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న భారతీయ జనతా పార్టీ.. ప్రచార పర్వంలో స్పీడును పెంచింది. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఈ ఎన్నికలు కీలకమని.. మీ ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని.. ప్రతీ దాంట్లో అవినీతి చేశారంటూ అమిత్ షా ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదని.. యువత, రైతులు, పేదలందరూ నిరాశలో ఉన్నారన్నారు. మిగులు ఆదాయం రాష్ట్రం.. అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కారు సహకరించకపోయినా.. తాము కేంద్ర పథకాలను అమలు చేశామని అమిత్ షా పేర్కొన్నారు. అమరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పడిందని.. సెప్టెంబర్ 17 నిర్వహణపై కేసీఆర్ ప్రభుత్వం మాటతప్పిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను తీసివేస్తామని పేర్కొన్నారు. ముస్లింలకు ఇస్తున్న 4శాతం రిజర్వేషన్ ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. లక్ష ఉద్యోగాలన్నారు.. ఎన్ని భర్తీ చేశారంటూ అమిత్ షా ప్రశ్నించారు. లక్ష రుణ మాఫీని చేయాలేదని.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని పేర్కొన్నారు.

పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని.. మార్పును కోరుకుంటే బీజేపీని ఆదరించాలంటూ అమిత్ షా కోరారు. తెలంగాణలో మార్పు అన్నది బీజేపీ ద్వారానే సాధ్యమన్నారు. అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను ఎత్తివేస్తామన్నారు. తొమ్మిదన్నరేళ్లలో కేంద్రం తెలంగాణకు 2.5 లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాలా తీసిందని తెలిపారు.

ఒవైసీకి ఓటేసినా.. కాంగ్రెస్ కు ఓటేసినా అవి బీఆర్ఎస్ వేళ్తాయని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆపార్టీలో ఉండరంటూ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు. బాయిల్డ్ రైస్ కూడా కొంటామన్నారు. ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశమివ్వాలంటూ అమిత్ షా కోరారు.

బిఆర్ఎస్ -2జి పార్టీ అంటే కేసీఆర్, కేటీఆర్ రెండు తరాలు.. ఎంఐఎం -3జి పార్టీ అంటే మూడు తరాల ఓవైసీ కుటుంబ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ -4జి పార్టీ నాలుగు తరాలుగా వస్తున్న కుటుంబ పార్టీ.. అంటూ అమిత్ షా ఎద్దెవా చేశారు. అధికారంలోకి రాగానే బిసినీ సీఎం చేస్తామన్నారు. కాంగ్రెస్ , బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. ఈసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు విన్నవిస్తున్నాన్నారు.

బిఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పొత్తు ఉండబోదని అమిత్ షా స్పష్టంచేశారు. రాజకీయంగా కానీ సిద్ధాంతపరంగా కానీ పొత్తు ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో.. అవినీతి కేసులను విచారణ సంస్థలు జరుపుతాయంటూ పేర్కొన్నారు. బెంగాల్ లో భారతీయ పౌరసత్వాన్ని అమ్ముతున్నారన్న అంశంపై విచారణ జరుగుతోందని.. ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. ప్రధానిపై అసభ్య పదజాలంతో మాట్లాడేవారికి ప్రజలే సమాధానం చెప్తారంటూ అమిత్ షా పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..