Mandava Venkateshwara Rao: ఎన్నికల వేళ కీలక పరిణామం.. కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతూ.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. త్రిముఖ పోరుతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో పలువురు నేతలు పార్టీలు మారుతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతూ.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. త్రిముఖ పోరుతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో పలువురు నేతలు పార్టీలు మారుతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ బోధన్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో మండవ చేరనున్నారు. బోధన్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మండవ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న వెంకటేశ్వరరావు 2019 ఉగాది రోజు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి పలుమార్లు గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2009 నుంచి మండవ వెంకటేశ్వరరావు పోటీకి దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో ఇటీవల మండవ వెంకటేశ్వరరావును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెస్ లో రావాలంటూ ఆహ్వానించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..