Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు భారత్‌ బంద్‌.. పెట్రోలియం‌ రేట్లు, జీఎస్టీకి నిరసనగా అఖిలభారత వ్యాపార సమాఖ్య పిలుపు

Bharat bandh 2021 : అఖిలభారత వ్యాపార సమాఖ్య రేపు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు, జీఎస్టీ, ఎలక్ట్రానినిక్‌ వేబిల్..

రేపు భారత్‌ బంద్‌.. పెట్రోలియం‌ రేట్లు, జీఎస్టీకి నిరసనగా అఖిలభారత వ్యాపార సమాఖ్య పిలుపు
Follow us
K Sammaiah

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2021 | 2:30 PM

Bharat bandh 2021 : అఖిలభారత వ్యాపార సమాఖ్య రేపు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు, జీఎస్టీ, ఎలక్ట్రానినిక్‌ వేబిల్‌(ఈ-వే) కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు అఖిలభారత వ్యాపార సమాఖ్య(సీఏఐటీ) పిలుపునిచ్చింది.

దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40,000 సంఘాలు అఖిలభారత వ్యాపార సమాఖ్య కింద ఉన్నాయి. అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం(ఐట్వా) కూడా శుక్రవారం రోడ్లను దిగ్బంధిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

దేశంలో ఇటీవ‌ల పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు వ‌ర‌స‌గా పెరిగిపోతున్నాయి. వాహ‌న‌దారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మతుంది. వర్తక వాణిజ్య వర్గాలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయితే రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ ధర‌ల పెరుగుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. వ‌ర‌స‌గా రెండో రోజు ప్రభుత్వ చమురు సంస్థలు ధరలను పెంచలేదు. ప్ర‌స్తుతం ఢిల్లీలో పెట్రోలు ధ‌ర లీట‌రుకు 90.93, డీజిల్ ధ‌ర 81.32గా ఉంది.

హైద‌రాబాద్‌లో పెట్రోలు లీట‌రుకు రూ.94.54గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ.88.69గా ఉంది. కోల్‌కతాలో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.91.12గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ.84.20గా కొన‌సాగుతోంది. ముంబైలో లీట‌రు పెట్రోలు ధ‌ర 97.34గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ.88.44గా ఉంది. చెన్నైలో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ. 92.90గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ.86.31గా కొన‌సాగుతోంది.

‘మత్స్య మంత్రిత్వ శాఖ” కామెంట్.. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ.!

కేరళ సముద్ర జలాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విన్యాసాలు..!

పుష్కలంగా జీతాలందుకుంటూనే అధికారుల కమీషన్లు, లంచాల కక్కుర్తి, వైరల్‌ అవుతున్న మున్సిపాలిటీ అధికారుల ఆడియో టేపులు

LSG vs PBKS: ఐపీఎల్ హిస్టరీలోనే స్పెషల్ మ్యాచ్.. ఎందుకంటే?
LSG vs PBKS: ఐపీఎల్ హిస్టరీలోనే స్పెషల్ మ్యాచ్.. ఎందుకంటే?
Viral Video: కూతుర్ల ప్రాణం కోసం తనకేమైనా పర్వాలేదునుకుంది చూడూ..
Viral Video: కూతుర్ల ప్రాణం కోసం తనకేమైనా పర్వాలేదునుకుంది చూడూ..
ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?
ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?
చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ
చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ
వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు
వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు
ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి