Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. వరంగల్‌లో ప్రచారం నిర్వహించిన టీపీసీసీ చీఫ్

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. జిల్లాల్లోని పట్టభద్రుల ఓట్లే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. వరంగల్‌లో ప్రచారం నిర్వహించిన టీపీసీసీ చీఫ్
Follow us
K Sammaiah

|

Updated on: Feb 25, 2021 | 9:39 AM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. జిల్లాల్లోని పట్టభద్రుల ఓట్లే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ సభలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మంథని ప్రజల పక్షాన పోరాడుతున్న న్యాయవాదులను మిట్టమధ్యాహ్నం నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన ఘటనపై ప్రభుత్వం స్పందించలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

మంథనిలో హైకోర్టు న్యాయవాదులు వామన రావు నాగమణి దంపతులను నడిరోడ్డుపై పొడిచి చంపినా సీఎం కేసీఆర్ ఖండించకపోవడాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని ఉత్తమ్ అన్నారు. ఇంత అమానుషమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని ఇది వాళ్ళ అయ్య జాగీరా అని మండిపడ్డారు. పట్టపగలు బహిరంగంగా న్యాయవాదులను చంపితే ముఖ్యమంత్రి నోరు మెదపలేదని మండిపడ్డారు. పోలీసులతో కుమ్మకై న్యాయవాదులను చంపితే సీఎం కేసీఆర్ ఏం మాట్లాడలేదని ఆరోపించారు. న్యాయవాదులను టీఆర్‌ఎస్‌ నాయకులే చంపారని అన్నారు.

మంథని నియోజకవర్గంలో పోలీస్ కస్టడీలో ఒక దళితుడిని చంపేస్తే ఆ కేసును పోలీసులు కప్పిపుచ్చితున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. వామన్ రావు నాగమణి దంపతులు హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో నిజం బయటకు వస్తుందనే భయంతోనే వారిని హత్య చేశారని ఆరోపించారు. వామన్‌రావు దంపతులు రక్షణ కావాలని కోరినా పోలీసులు రక్షణ ఇవ్వలేదని మండిపడ్డారు

Read more:

గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే సాంప్రదాయ నృత్యం.. సమ్మక్క సారక్కను దర్శించుకున్న సీతక్క