గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే సాంప్రదాయ నృత్యం.. సమ్మక్క సారక్కను దర్శించుకున్న సీతక్క

తెలంగాణలో మేడారం మినీ జాతర సందడి నెలకొంది. రెండేళ్ల కోసారి మేడారం సమ్మక్క సారక్క మహాజాతర జరగుతూ ఉంటుంది. అయితే ఆ మధ్యలో..

  • K Sammaiah
  • Publish Date - 9:21 am, Thu, 25 February 21
గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే సాంప్రదాయ నృత్యం.. సమ్మక్క సారక్కను దర్శించుకున్న సీతక్క

తెలంగాణలో మేడారం మినీ జాతర సందడి నెలకొంది. రెండేళ్ల కోసారి మేడారం సమ్మక్క సారక్క మహాజాతర జరగుతూ ఉంటుంది. అయితే ఆ మధ్యలో వచ్చే సంవత్సరంలో మినీ జాతర నిర్వహిస్తూ ఉంటారు. మహాజాతర రీతిలో జరగకపోయినా భక్తులు భారీగానే మేడారం చేరుకుని సమ్మక్క, సారక్క గద్దెలను దర్శించుకుంటారు. ఇక ములుగు జిల్లా మేడారంలోనే కాకుండా వివిధ జిల్లాల్లో నెలకొన్న సమ్మక్క సారక్క గద్దెల వద్ద గిరిజనులు మినీ జాతర జరుపుకుంటూ ఉంటారు.

మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం చింతలగట్టు వట్టెవాగు వద్ద నెలకొన్న మేడారం సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద మినీ జాతర వైభవంగా కొనసాగుతుంది. ఈ జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సాధారణ భక్తులే కాకుండా మహబూబబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్క సమక్క – సారలమ్మలను దర్శించుకుని అమ్మవార్లకు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. దుష్టశక్తులు రాకుండ ధ్వజస్తంభం ఏర్పాటు చేసి దానికి కోడి పిల్లను వేలాడదీశారు. జాతర ఆవరణమంతా మామిడి ఆకుల తోరణాలతో ఆలంకరించారు.

మిని మేడారంగా వర్దిల్లుతున్న చింతలగట్టు మేడారాన్ని మరింత అభివృద్ది చేస్తానని, వచ్చే ఏడాదికల్లా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపాడు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క సాంప్రదాయ నృత్యం చేశారు. చందాలు వేసుకునీ జాతర నిర్వహిస్తున్న పూజారులను ఆమె అభినందించారు. ప్రభుత్వం అధికారికంగా జాతరను గుర్తించి, మరింత అభివృద్ది చేయాలనీ ఆమె కోరారు.

Read more:

ఎన్ఆర్ఈజీఎస్ తీసుకొచ్చిన ఘతన కాంగ్రెస్‌దే.. ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్న జీవన్‌రెడ్డి