ఎన్ఆర్ఈజీఎస్ తీసుకొచ్చిన ఘతన కాంగ్రెస్‌దే.. ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్న జీవన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అగ్రస్థానంలో ఉండి పోరాటం చేస్తే ముందు వరుసలో ఉన్న న్యాయవాదులను, ప్రశ్నించే గొంతుకలను..

  • K Sammaiah
  • Publish Date - 9:05 am, Thu, 25 February 21
ఎన్ఆర్ఈజీఎస్ తీసుకొచ్చిన ఘతన కాంగ్రెస్‌దే.. ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్న జీవన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అగ్రస్థానంలో ఉండి పోరాటం చేస్తే ముందు వరుసలో ఉన్న న్యాయవాదులను, ప్రశ్నించే గొంతుకలను మంథని నడివీధుల్లో పాశవికంగా టిఆర్ఎస్ నాయకులు హత్య చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ నోరు ఎందుకు మెదపడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పరిచయ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. మంథని నడివీధుల్లో పాశవికంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయవాదులను హత్య చేస్తే సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు సంబంధించిన వారు ఉన్నారని సీబీఐ విచారణకు కానీ జుడిషియల్ ఎంక్వయిరీ ఎందుకు వేయడం లేదని న్యాయవాదుల హత్య కేసులో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని మండిపడ్డారు. 1988-89 లో తెలుగుదేశం హయాంలో విజయవాడ వంగవీటి మోహన రంగా ప్రభుత్వ హత్య చేయబడిందని ఆయన అన్నారు ఆనాడు హత్య తోనే తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

మంథనిలో జరిగిన న్యాయవాదుల హత్యతో టీఆర్‌ఎస్‌ పార్టీ అంతం ఆరంభమైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు గ్రామాల్లో పని చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. వైకుంఠధామం, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, రైతు వేదికలు, హరితహారంలాంటి కార్యక్రమాలు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపడుతున్నారు. అయితే పేద ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో సోనియాగాంధీ ఆలోచన నుంచి పుట్టిందే ఎన్ఆర్ఈజీఎస్ అని జీవన్ రెడ్డి అన్నారు. అలాంటి ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ 40 వేల మంది తొలగించి వారి ఉసురు పోసుకున్న వ్యక్తి కేసీఆర్ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

Read more:

చంద్రబాబు టూర్‌తో కుప్పంలో హైటెన్షన్‌.. వైసీపీ అన్నంత పని చేస్తుందా..? అంత సీన్ లేదంటున్న టీడీపీ..