ప్రతి కుటుంబానికి రూ .5 లక్షల ఆరోగ్య బీమా.. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రాజస్థాన్ సర్కార్ ఆ రాష్ట్ర ప్రజలపై వరాలజల్లు కురిపించింది. రాష్ట్రంలో ఇంటింటికి 5లక్షల రూపాయల చొప్పున ఆరోగ్య బీమాను కల్పిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి కుటుంబానికి రూ .5 లక్షల ఆరోగ్య బీమా.. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Feb 25, 2021 | 8:45 AM

Universal Healthcare Scheme : రాజస్థాన్ సర్కార్ ఆ రాష్ట్ర ప్రజలపై వరాలజల్లు కురిపించింది. రాష్ట్రంలో ఇంటింటికి 5లక్షల రూపాయల చొప్పున ఆరోగ్య బీమాను కల్పిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య బీమాను కల్పిస్తూ నూతన పథకానికి బడ్జెట్ లో రూ.3,500లను కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఆరోగ్య హక్కు బిల్లులను రాజస్థాన్ అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక, రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న రాజస్థాన్ సర్కారు అన్నదాతల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ ను రూపొందిస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది రాజస్థాన్ సర్కార్. రాజస్థాన్ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇప్పటివరకు కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు సీఎం గుర్తు చేశారు. కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసామన్నారు. అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైతే పరీక్ష సంఖ్యను కూడా పెంచుతామన్నారు. ప్రత్యేక కొవిడ్ ప్యాకేజీని అమలు చేస్తామని సీఎం గెహ్లాట్ ప్రకటించారు. కరోనా సంక్షోభం సందర్భంగా ఒక్కో కుటుంబానికి మరో వెయ్యిరూపాయల చివరివిడత ఆర్థికసాయం అందిస్తామని సీఎం చెప్పారు. ప్రతి జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన. ప్రస్తుతం ఉన్న ఎనిమిది నర్సింగ్ కళాశాలలతో పాటు 25 కొత్త కళాశాలలను ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే, పోటీ పరీక్షలు రాసేందుకు వస్తున్న అభ్యర్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని సీఎం చెప్పారు. జీవన్ రక్షక్ యోజన కింద రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేవారికి రూ .5 వేలు పారితోషికం ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో సమర్పించింది. ఇందులో 3,500 కోట్ల రూపాయల యూనివర్సల్ హెల్త్ కేర్ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 3,500 కోట్ల రూపాయల వ్యయంతో సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అమలు చేయనున్నట్లు, దీని కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు వైద్య బీమా ప్రయోజనం లభిస్తుందని సీఎం అశోక్ గెహ్లోట్ చెప్పారు.

“రాష్ట్రంలో కష్టతరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, రాష్ట్ర అభివృద్ధికి వనరుల కొరత ఉండకూడదు. ఆర్థిక వనరులను సుదూర ఆలోచనతో సమీకరించడానికి మేము ఈ తీర్మానాన్ని తీసుకుంటున్నాము” అని ముఖ్యమంత్రి గెహ్లాట్ చెప్పారు .

అలాగే పట్టణ ప్రాంతాల వీధి వ్యాపారులు, యువత మరియు అన్ని ప్రాంతాల నిరుద్యోగుల స్వయం ఉపాధి అవసరాల కోసం ఇందిరా గాంధీ అర్బన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద ఐదు లక్షల మంది పేదలకు రూ .50 వేల వరకు వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. అర్హతగల యువతకు ప్రస్తుతం చెల్లించాల్సిన నిరుద్యోగ భత్యాన్ని రూ .1000 పెంచుతున్నట్లు గెహ్లాట్ ప్రకటించారు. 5000 జనాభా ఉన్న గ్రామాల్లో 1,200 మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Read Also…

Gas Cylinder Prices: సామాన్యులపై గుదిబండ.. మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధర.. ఎంతంటే.!

ఓటమి పాలైన నాయకుల బరితెగింపులు.. ఆ పంచాయతీలో స్మశాన వాటిక రోడ్డును తవ్వేసిన వైసీపీ నేతలు