బీజేపీలో చేరిన సినీ నటి ప్రియా రామన్..

ప్రముఖ సినీనటి ప్రియారామన్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఏపీలో ఇక చక్రం తిప్పబోతున్నారు. దేశంలోని ప్రముఖ పార్టీ అయిన బీజేపీలో నటి ప్రియారామన్ చేరారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రియా రామన్ మాట్లాడుతూ.. సమాజసేవ చేసేందుకే తను రాజకీయాల్లోకి వచ్చానని.. పదవులు తనకు ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. 44 సంవత్సరాల ప్రియా రామన్ 1993లో వచ్చిన […]

బీజేపీలో చేరిన సినీ నటి ప్రియా రామన్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 24, 2019 | 5:01 PM

ప్రముఖ సినీనటి ప్రియారామన్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఏపీలో ఇక చక్రం తిప్పబోతున్నారు. దేశంలోని ప్రముఖ పార్టీ అయిన బీజేపీలో నటి ప్రియారామన్ చేరారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రియా రామన్ మాట్లాడుతూ.. సమాజసేవ చేసేందుకే తను రాజకీయాల్లోకి వచ్చానని.. పదవులు తనకు ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు.

44 సంవత్సరాల ప్రియా రామన్ 1993లో వచ్చిన ‘వల్లి’తో సినీ రంగ ప్రవేశం చేశారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడతో పాటు మాతృభాష అయిన మలయాళంలో కూడా ఆమె అనేక సినిమాలలో నటించారు. కేరళలోని పాల్గాట్‌కు చెందిన ప్రియా రామన్.. ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాలలో నటించారు. తెలుగులో ‘దేశ ద్రోహులు, లీడర్, శుభ సంకల్పం, దొరబాబు, మావూరి మహారాజు, శ్రీవారి ప్రియురాలు’ వంటి పలు విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించారు. 2018లో ‘పడిపడి లేచె మనసు’లో.. ప్రియా రామన్ నటించిన చివరి సినిమా.

కాగా.. దక్షిణాదిలోని అన్ని ప్రాంతాల వారికి పరిచయం ఉన్న నటి కావడంతో ఆమె చేరిక పార్టీకి ఎంతగానో లభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని నివాసంలో ఉంటున్న ఆమె.. ఏపీలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!