జనసేన పార్టీకి ‘రూ.100 కోట్ల ఫండ్’..! షాక్‌లో నాగబాబు..?
‘నా ఛానెల్.. నా ఇష్టం’ అంటూ.. నాగబాబు.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఛానెల్ ద్వారా..! తను అడగాల్సినవన్నీ.. తను అనుకున్నవన్నీ నిర్మొహమాటంగా చెప్పేవారు. అలాగే.. మధ్య మధ్యలో జబర్దస్త్ కమెడీయన్స్ చేసే స్కిట్స్ కూడా కనిపిస్తూంటాయి. జబర్దస్త్.. కమెడీయన్స్‌కి కూడా.. చిరంజీవి.. పవన్.. నాగబాబు అన్నా.. అమితమైన ప్రేమ.. అది వాళ్ల స్కిట్స్‌లలోనే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా.. నాగబాబు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత.. తన యూట్యూబ్ ఛానెల్‌కి కాస్త దూరంగానే […]

‘నా ఛానెల్.. నా ఇష్టం’ అంటూ.. నాగబాబు.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఛానెల్ ద్వారా..! తను అడగాల్సినవన్నీ.. తను అనుకున్నవన్నీ నిర్మొహమాటంగా చెప్పేవారు. అలాగే.. మధ్య మధ్యలో జబర్దస్త్ కమెడీయన్స్ చేసే స్కిట్స్ కూడా కనిపిస్తూంటాయి. జబర్దస్త్.. కమెడీయన్స్‌కి కూడా.. చిరంజీవి.. పవన్.. నాగబాబు అన్నా.. అమితమైన ప్రేమ.. అది వాళ్ల స్కిట్స్‌లలోనే కనిపిస్తూ ఉంటుంది.
తాజాగా.. నాగబాబు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత.. తన యూట్యూబ్ ఛానెల్‌కి కాస్త దూరంగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత.. ఆయన ప్రేక్షకుల ముందు మరో వీడియోతో ముందుకు వచ్చారు. ఈరోజు పవన్ బర్త్‌డే సందర్భంగా.. ముందుగా ఆయనకి విషెస్ తెలిపారు. ఆ తర్వాత వాళ్లు.. అభిమానులు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిన తీరు.. వివరించారు.
ఈ సందర్భంగా.. ఆయన మరో ఆసక్తికర చర్చ చేశారు. పవన్ బర్త్ డే సందర్భంగా.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. జనసేన పార్టీకి దాదాపు 100 కోట్ల రూపాయల విరాళాన్ని సేకరించాలని నిర్ణయించుకున్నారంట. ఆ విషయాన్ని వివరిస్తూ.. మొదట ఇది విని నేను ఆశ్చర్యం వ్యక్తం చేశానని.. ఇప్పటివరకూ.. ఏ పార్టీకి.. వాళ్ల పార్టీ అభిమానులు ఇలా సేకరించలేదని.. అదీ.. అభిమానుల్లో పవన్‌కు ఉన్న స్థానమని అభినందించారు.
ఇలా కార్యకర్తలు ఫండ్‌ని కలెక్ట్ చేద్దామని అనుకున్నారో.. లేదో.. చాలా మంది పార్టీ అభిమానులు శనివారమే.. బ్యాంక్‌కు క్యూ కట్టి.. డొనేషన్లు ఇవ్వడం అనేది ఒక రకంగా నన్ను షాక్‌కి గురి చేసిందని తెలిపారు నాగబాబు. ఇంతిలా అభిమానించే వాళ్లు జనసేన పార్టీకి అండగా ఉన్నందుకు ఎంతో సంతోషంగానూ.. ఎమోషనల్ గానూ ఉందని నటుడు నాగబాబు పేర్కొన్నారు.