5

తెలంగాణకు కొత్త గవర్నర్.. బీజేపీ స్టాటజీలో న్యూ చాప్టర్..!

బీజేపీ.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ జెండా ఎగరేసేందుకు “మోదీ షా” ద్వయం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అయితే తమ పార్టీకి సరైన మోజార్టీ లేని చోట.. ఏ విధంగా పాగా వేయాలన్న ప్లాన్లు వేయడంలో అమిత్ షా టీం.. పక్కా స్కెచ్ వేసి.. విజయం సాధిస్తూ వస్తోంది. కొన్ని చోట్ల కొంచెం అటు ఇటూ అయినా.. దాదాపు అనుకున్న టార్గెట్‌ను చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ గడ్డ మీద ఎట్టి పరిస్థితుల్లో […]

తెలంగాణకు కొత్త గవర్నర్.. బీజేపీ స్టాటజీలో న్యూ చాప్టర్..!
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 1:15 PM

బీజేపీ.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ జెండా ఎగరేసేందుకు “మోదీ షా” ద్వయం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అయితే తమ పార్టీకి సరైన మోజార్టీ లేని చోట.. ఏ విధంగా పాగా వేయాలన్న ప్లాన్లు వేయడంలో అమిత్ షా టీం.. పక్కా స్కెచ్ వేసి.. విజయం సాధిస్తూ వస్తోంది. కొన్ని చోట్ల కొంచెం అటు ఇటూ అయినా.. దాదాపు అనుకున్న టార్గెట్‌ను చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ గడ్డ మీద ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అధికారమే ధ్యేయమంటూ చెప్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఘోర పరాభవం తప్పలేదు. ఉన్న అయిదు సీట్లలో నాలుగు సీట్లు కోల్పోయి కేవలం ఒక్క సీటు మాత్రమే మిగుల్చుకోగలిగింది. అయితే కేవలం ఆరు నెలలోపే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా నాలుగు పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండాను ఎగరేసింది. అయితే వచ్చే ఎన్నికలనాటికి అధికారం చేపట్టడానికి ఓ వైపు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపగా.. మరో వైపు రాజ్యాంగ బద్దమైన వ్యూహాంతో పాచిక వేశారు. ఆ పాచికే గవర్నర్.

గత పదేళ్లుగా ఉన్న ఈవీఎల్ నరసింహన్ ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి.. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరించారు. అయితే తాజాగా నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన సౌందరరాజన్‌ను నియమించారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

అయితే ఇప్పటి వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నర్లుగా మహిళలు లేరు. అయితే ఇదే అంశాన్ని బీజేపీ అనుకూలంగా చేసుకుంది.సౌందరరాజనే తొలి మహిళా గవర్నర్. ఎందుకిలా? అంటే.. దానికి కారణాలు లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలోనూ.. తాజాగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కారులోనూ మంత్రిమండలిలో మహిళలకు చోటు దక్కని విషయం తెలిసిందే. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా కోట్లాడారు. అయితే తెలంగాణ కేబినెట్‌లో చోటు లేకపోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. కేసీఆర్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది లేదు. మహిళకుచోటు ఇచ్చింది లేదు. తొలి సారి ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో కేవలం పద్మా దేవందర్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు.

అయితే రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ చేయలేదు. అయితే మరికొద్ది రోజుల్లో కేబినెట్ విస్తరించే దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి వేళ.. వారికంటే ముందుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళను గవర్నర్‌గా ఎంపిక చేయటం ద్వారా.. కేసీఆర్ కంటే ఎక్కువగా బీజేపీనే ప్రాధాన్యత ఇచ్చారన్న పేరును తాజా నిర్ణయంతో సొంతం చేసుకున్నట్లయ్యింది.

అయితే ఇప్పటి వరకు ప్రముఖంగా మహిళలకు ప్రాధాన్యత గల పదవులు ఇవ్వలేదనే విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్.. తొలి మహిళా గవర్నర్‌తో ఎలా నెగ్గుకు వస్తారో వేచిచూడాలి.

ప్రపంచ కప్ చరిత్రలో బ్రేక్ చేయలేని 5 రికార్డులు.. అవేంటో తెలుసా?
ప్రపంచ కప్ చరిత్రలో బ్రేక్ చేయలేని 5 రికార్డులు.. అవేంటో తెలుసా?
ఆరో రోజు మెడల్ ఈవెంట్స్ ఇవే.. భారత ఆటగాళ్ల షెడ్యూల్ ఎలా ఉందంటే?
ఆరో రోజు మెడల్ ఈవెంట్స్ ఇవే.. భారత ఆటగాళ్ల షెడ్యూల్ ఎలా ఉందంటే?
నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌, వేదికల వివరాలు..
నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌, వేదికల వివరాలు..
లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్.. 11 నెలల తర్వాత స్వదేశానికి..
లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్.. 11 నెలల తర్వాత స్వదేశానికి..
World Cup: జరగబోయేది వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రరిస్ట్ కప్..
World Cup: జరగబోయేది వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రరిస్ట్ కప్..
ప్రపంచకప్‌లో అతిపెద్ద వివాదాలు ఇవే.. లిస్టులో భారత ఆటగాళ్లు కూడా
ప్రపంచకప్‌లో అతిపెద్ద వివాదాలు ఇవే.. లిస్టులో భారత ఆటగాళ్లు కూడా
రాశిఫలాలు: 12 రాశుల వారికి సెప్టెంబర్ 29 దినఫలాలు ఇలా..
రాశిఫలాలు: 12 రాశుల వారికి సెప్టెంబర్ 29 దినఫలాలు ఇలా..
World Cup: మారిన తుది జాబితా.. 10 జట్ల స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?
World Cup: మారిన తుది జాబితా.. 10 జట్ల స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?
ఆస్ట్రేలియా ఫైనల్ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. తుఫాన్ ప్లేయర్ ఎంట్రీ
ఆస్ట్రేలియా ఫైనల్ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. తుఫాన్ ప్లేయర్ ఎంట్రీ
5వ రోజు అదరగొట్టిన భారత్.. పాయింట్ల పట్టికలో 5వ స్థానం..
5వ రోజు అదరగొట్టిన భారత్.. పాయింట్ల పట్టికలో 5వ స్థానం..