బిజెపిపై జగన్ దిమ్మతిరిగే యాక్షన్ ప్లాన్

అయిదు నెలల పాలనతో ఏపీపై తనదైన ముద్ర వేసిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్.. ప్రత్యర్థి పార్టీలపై కూడా వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. టిడిపిని టచ్ చేయకుండానే.. వెన్ను విరిచిన జగన్.. బిజెపిపై కూడా తనదైన స్టైల్లో కొత్త ఫార్ములా అమలు పరుస్తున్నారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే.. ఈ వ్యూహంలోను జగన్‌క కెసీఆర్ మార్గదర్శిలా కనిపించడం విశేషం. ఇంతకీ కొత్త ఫార్ములా ఏంటనే కదా మీ డౌటు ? రీడ్ దిస్ స్టోరీ.. కొన్నేళ్ళ […]

బిజెపిపై జగన్ దిమ్మతిరిగే యాక్షన్ ప్లాన్
Follow us
Rajesh Sharma

| Edited By: Srinu

Updated on: Nov 06, 2019 | 6:04 PM

అయిదు నెలల పాలనతో ఏపీపై తనదైన ముద్ర వేసిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్.. ప్రత్యర్థి పార్టీలపై కూడా వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. టిడిపిని టచ్ చేయకుండానే.. వెన్ను విరిచిన జగన్.. బిజెపిపై కూడా తనదైన స్టైల్లో కొత్త ఫార్ములా అమలు పరుస్తున్నారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే.. ఈ వ్యూహంలోను జగన్‌క కెసీఆర్ మార్గదర్శిలా కనిపించడం విశేషం. ఇంతకీ కొత్త ఫార్ములా ఏంటనే కదా మీ డౌటు ? రీడ్ దిస్ స్టోరీ..
కొన్నేళ్ళ నుంచి వైసీపీ, బిజెపి అంతర్గతంగా మిత్రులేనన్నది టిడిపి వాదన. కానీ అలాంటి దాఖలాలేవీ లేవని వైసీపీ అధినేత కుండబద్దలు కొడుతూనే వున్నారు తరచుగా. అయితే.. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపితో సఖ్యత అవసరం అనేది పెద్దగా రాజకీయ పరిఙ్ఞానం లేని వారు కూడా చెబుతారు. అయితే.. ఆ సాఫ్ట్ కార్నర్ రాష్ట్రంలో ప్రతిబింబిస్తే మొదటికే మోసం రాక తప్పదన్నది వైసీపీ అంచనా. అందుకే కొత్త వ్యూహంతో సరికొత్తగా బిజెపిని నియంత్రిస్తున్నారు వైసీపీ అధినేత.
హస్తినలో దోస్తీ..హైదరాబాద్‌లో ఫైట్‌.. మొన్నటివరకూ తెలంగాణలో నడిచిన ఫార్ములా. ఇప్పుడు అదే థియరీ ఏపీలో నడుస్తోందట. కేంద్రంలో స్నేహం…అమరావతిలో జగడం కాన్సెప్ట్‌తో ముందుకు వెళుతున్నారట. మరీ రాజకీయంలో ఒక్కసారి వర్క్‌వుట్ ప్లాన్‌..రెండోసారి వర్క్‌వుట్‌ అవుతుందా?
తెలంగాణలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కేంద్రంతో  ప్రెండ్‌షిప్‌ చేశారు. కేంద్రానికి అనుకూలంగా చాలా ప్రకటనలు చేశారు. జీఎస్టీని సమర్ధించారు. నోట్ల రద్దుకు మద్దతు ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి బీజేపీకి అనుకూలంగా మాట్లాడేవారు. మోదీతో కలిసి ముందుకు వెళ్లారు. మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవానికి మోదీని పిలిచారు. ఘనంగా సన్మానించారు.
ఇదంతా సాఫీగా నడిచింది. ఢిల్లీతో ఫ్రెండ్‌షిప్‌ కంటిన్యూ చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు పూర్తిగా ఢిల్లీ సహాకారం తీసుకున్నారు. కానీ గల్లీలో మాత్రం కమలానికి చుక్కలు చూపించారు కేసీఆర్‌. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని చావదెబ్బకొట్టారు. లాస్ట్‌ మినిట్‌ వరకూ బీజేపీ సిట్టింగ్‌ సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. చివర్లో గట్టి అభ్యర్థులను ప్రకటించి…..బీజేపీ బలాన్ని ఐదు నుంచి ఒకటికి తగ్గించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా చర్యలు చేపట్టారు.
సరిగ్గా ఇప్పుడు ఇదే ఫార్ములాను జగన్‌ ఫాలో కావాలని చూస్తున్నారట. కేంద్రంతో దోస్తీ చేసి….అమరావతిలో మాత్రం బీజేపీకి చెక్‌ పెట్టాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఢిల్లీ వెళ్లినపుడు బీజేపీ నేతలు కలుస్తున్నారు. ఏపీకి రావాల్సిన అందాల్సిన సాయాన్ని అడుగుతున్నారు. అదే టైమ్‌లో ఇక్కడ కన్నా,సుజనా బ్యాచ్‌కు చెక్‌ పెట్టే వ్యూహానికి పదును పెడుతున్నారట.
కేసీఆర్‌ 2014 నుంచి 2018 వరకు అమలు చేసినా వ్యూహామే…ఇప్పుడు జగన్‌ వర్క్‌వుట్‌ చేస్తున్నారట. మరీ రాజకీయాల్లో ఒకసారి వర్క్‌వుట్‌‌ అయిన థియరీ మరోసారి వర్క్‌వుట్‌ కాదని అంటారు. మరీ తెలంగాణలో పనికొచ్చిన సిద్దాంతం ఏపీలో పనికొస్తుందో లేదో చూడాలి.