ఎల్వీ బదిలీపై కేంద్రం సీరియస్.. కీలక బాధ్యతలు..?
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సర్కార్ అనూహ్యంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎస్ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాలేదని ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారట. ఈ మేరకు ఆయనను బదిలీ చేయడానికి గల కారణాలపై కేంద్ర ఇంటిలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. అంతేకాదు పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ అయిన సుబ్రహ్మణ్యం.. కేంద్ర సర్వీసులకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని […]
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సర్కార్ అనూహ్యంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎస్ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాలేదని ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారట. ఈ మేరకు ఆయనను బదిలీ చేయడానికి గల కారణాలపై కేంద్ర ఇంటిలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. అంతేకాదు పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ అయిన సుబ్రహ్మణ్యం.. కేంద్ర సర్వీసులకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఆయన సేవలను వాడుకోవాలని భావిస్తున్న కేంద్రం.. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. కాగా సీవీసీగా ప్రస్తుతం కేవీ చౌదరి ఉండగా.. ఆ పదవిలో ఆయన ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఇక ఎల్వీ సుబ్రహ్మణ్యం పదవీ కాలం కూడా మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. ఏదైనా కీలక బాధ్యతల్లోకి ఆయనను తీసుకుంటే.. పదవీ కాలాన్ని పొడిగించాల్సి వస్తుంది. మరి కేవీ చౌదరి స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను తీసుకుంటారో..? లేక ఆయనకు వేరే పదవిని ఇస్తారో..? చూడాలి.కాగా ఉన్నట్లుండి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. జగన్‌కు సన్నిహితంగా ఉన్న ఎల్వీని.. అనూహ్యంగా ఎందుకు బదిలీ చేశారని ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. మరోవైపు ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై మాట్లాడిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందంటూ విమర్శించారు. ఏపీ సర్కారు రాజ్యాంగ సంక్షోభం దిశగా నడుస్తోందని.. కేంద్రం అన్నీ గమనిస్తోందంటూ హెచ్చరించారు.