AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Legs-Up-the-Wall: యోగాలో ఈ ఆసనం ప్రయోజనాలేంటో తెలుసా..? ఈ వ్యాధుల నుంచి ఉపశమనం..

పాదాలను గోడకు ఆనించి నిద్రించడం అనేది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే ఒక రకమైన వ్యాయామం. ఈ సాధారణ వ్యాయామం చేయడం ద్వారా, అసంఖ్యాక ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు ఈ ఆసనాన్ని చేయాలని సూచిస్తున్నారు. దీంతో కండరాల నొప్పి నుండి అధిక రక్తపోటు వరకు అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

Jyothi Gadda
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 09, 2024 | 7:56 PM

Share
Legs-Up-the-Wall: గత కొంతకాలంగా యోగాకు ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఆసనాలు శారీరక, మానసిక రుగ్మతల నుండి ఉపశమనాన్ని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. అలాంటి యోగాసనాలలో ఒకటి విపరిత కరణి ఆసనం. దీనిని వాల్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే వాల్ పోజ్ చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుందని చెబుతున్నారు.. కాబట్టి విపరీత కరణి ఆసనం ఎలా చేయాలో, ఈ ఆసనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: బలహీనమైన జీర్ణవ్యవస్థ కారణంగా, మలబద్ధకం, కడుపు నొప్పి, అపానవాయువు వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు.  ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి, మీరు ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు మీ పాదాలను గోడకు ఆనుకుని నిద్రించాలి.

2 / 5
నిద్రలేమి సమస్య పోతుంది: ఈ ఆసనాన్ని ఇన్‌వర్టెడ్ స్లీపింగ్ పొజిషన్ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని వలన మీరు ఆందోళన మరియు నిద్రలేమి సమస్యల నుండి బయటపడవచ్చు.

3 / 5
కండరాల నొప్పి నుండి ఉపశమనం: మీ పాదాలను గోడకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటే కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఇది మీ పాదాలు మరియు అరికాళ్ళలో నొప్పిని తగ్గిస్తుంది.

4 / 5
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: పాదాలను గోడకు ఆనుకుని నిద్రించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మీ కాళ్ళలో వాపు, జలదరింపును కూడా తగ్గిస్తుంది. కొందరిలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరంలో వాపు సమస్య కనిపిస్తుంది.

5 / 5