- Telugu News Photo Gallery Betel Leaves Benefits Grow Thick And Long Hair Naturally At Home Telugu News
Betel Leaf for Hair Growth : ఒత్తైన, పట్టులాంటి జుట్టు కోసం…తమలపాకులను ఇలా వాడితే అద్భత ఫలితం చూస్తారు..
నేటి బిజీ జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడితో కూడిన జీవితం వంటి అనేక కారణాల వల్ల ప్రజలు జుట్టు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తుగా పొడవాటి జుట్టు కలిగి ఉండాలంటే కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉండదు. బదులుగా, మీరు ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో సహజంగా ఒత్తైన జుట్టును పొందవచ్చు. తమలపాకులు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. కాలుష్యం కారణంగా బలహీనంగా ఉన్న జుట్టుకు బలాన్నిస్తాయి. ముతక జుట్టు కూడా మృదువుగా మారుతుంది.
Updated on: Apr 09, 2024 | 7:56 PM

తమలపాకులను ఎప్పటి నుంచో గృహవైద్యాలలో ఉపయోగిస్తున్నారు. తమలపాకుల్లో అనేక ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. తమలపాకులలో పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్లు A, C, B2, B1 పుష్కలంగా ఉన్నాయి, ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి.

తమలపాకులో పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్ A, విటమిన్ సి, విటమిన్ B2, విటమిన్ B1 వంటి పోషకాలు శరీర ఆరోగ్యానికే కాకుండా జుట్టు సంరక్షణకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తమలపాకులోని యాంటీమైక్రోబయాల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు ఊడిపోవటాన్ని నిరోధిస్తాయి. అందుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తాయి.

జుట్టుకు తమలపాకు చికిత్సకు ఎక్కువ శ్రమ అవసరం లేదు. తమలపాకులను బాగా కడిగి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో ఒక టేబుల్‌స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసి, మీ జుట్టుకు అప్లై చేసి, గంట తర్వాత షాంపూతో గోరువెచ్చని నీటితో కడగాలి.

తమలపాకులోని విటమిన్ సి జుట్టు పెరుగుదలకు సహాయపడటంతోపాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు.. స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తుంది. చుండ్రు సమస్యను చెక్‌పెట్టి జుట్టు కండీషనర్‌లా పనిచేస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.

ఇలా వారానికోసారి చేయడం వల్ల తమలపాకులోని పోషకాలు జుట్టుకు చేరుతాయి. జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు మూలాల నుండి చాలా ఆరోగ్యంగా, బలంగా, మృదువుగా పెరుగుతుంది.




