Worst Foods For Liver: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు వీటిని పూర్తిగా మానేయాలి.. లేదంటే పెనుముప్పు తప్పదు
ఓవైపు సాంకేతికత అభివృద్ధిలో ప్రపంచం మునుముందుకు పోతుంటే ప్రజల జీవనం మరింత అస్తవ్యస్తంగా తయారవుతుంది. దీనితో వేలాది రోగాలు శరీరంలో తిష్ట వేస్తున్నాయి. నేటి కాలంలో చాలా మంది యువత ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఇష్టపడటం లేదు. ఇదే గందరగోళానికి అసలు కారణం. అనారోగ్యకరమైన బయటి ఆహారం, నూనె-మసాలా ఆహారాలు, వేయించిన ఆహారం, ఫాస్ట్‌ఫుడ్‌లను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు..
Updated on: Jun 25, 2024 | 8:55 PM

Worst Foods For Liver: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు వీటిని పూర్తిగా మానేయాలి.. లేదంటే పెనుముప్పు తప్పదు

పలితంగా యువతలో ఫ్యాటీ లివర్ సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ఎక్కువగా వీరిలో కనిపిస్తుంది. సరైన చికిత్స చేయకపోతే లివర్ సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. కొవ్వు కాలేయ సమస్యలను నివారించడానికి, బయటి ఆహారాన్ని పూర్తిగా నివారించాలి. వీటితోపాటు కొన్ని సాధారణ ఆహారాలను రోజువారీ ఆహారం నుంచి మినహాయించాలి.

ఫ్యాటీ లివర్‌తో బాధపడుతుంటే మొదట, నెయ్యి, వెన్నలను ఆహారం నుంచి పూర్తిగా తొలగించాలి. ఇందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఆవాలు ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటలో ఉపయోగించాలి. అలాగే ఇంట్లో తయారుచేసిన మటన్ కూడా హానికరం. ఆరోగ్యంగా ఉండాలంటే మటన్ పూర్తిగా మానేయాలి. మటన్ లేదా రెడ్ మీట్ తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు, కొలెస్ట్రాల్ మరింత పెరుగుతుంది.

కాలేయ సమస్యల విషయంలో పిండితో చేసిన కేకులు, పేస్ట్రీలు వంటివి మానేయాలి. అదేవిధంగా లూచీ, పరోటా వంటివి కూడా తినకూడదు. మైదా పిండి ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడదు. బదులుగా ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారుతుంది.

చక్కెర తినకూడదు. చాలా మంది టీలో చక్కెర వేసుకుని తాగుతుంటారు. అలాగే ఇతర ఆహారాలలో కూడా అధిక చక్కెరను వినియోగిస్తుంటారు. ఇలా చేయకూడదు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, చక్కెరను పూర్తిగా మానేయాలి.




