- Telugu News Photo Gallery World photos The worlds first luxury sports hovercraft can float over land and water at 60mph see photos
ప్రపంచంలోనే ఈ కారు స్పెషల్.. నీటిపై కూడా యమ స్పీడ్.. ప్రత్యేకతలు మీకోసం..
రోడ్డు మీదనే కాకుండా..నీటిలోనూ ప్రయాణించే మొట్ట మొదటి లగ్జరీ కారును లండన్‌లో ప్రవేశ పెట్టారు. ఈ హోవర్‌క్రాఫ్ట్ రోడ్డు మరియు నీటిపై గంటకు 96 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
Updated on: Feb 24, 2022 | 8:24 PM

ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారును ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నారు. మొదట ఇది 180 వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రకం కారు ఆటోమొబైల్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ఇలాంటి కారు తయారు చేయడం మొదటి సారి కాదు.. 1950లోనే ఇలాంటి కారును ఉత్పత్తి చేశారు. అయితే కొత్త హోవర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసిన వాన్మెర్సియర్ సంస్థ దానిలో అనేక ఆవిష్కరణలు చేసింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఆవిష్కరణ, కొత్త సాంకేతికత ఉంది.

ఈ కారులో పెట్రెల్ ఇంజన్ ఉపయోగించారు. ఇందులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇందులో అడ్వాన్స్ డైరెక్షన్ సిస్టమ్ కూడా ఉంది. దీనిని డ్రైవర్ సులభంగా ఆపవచ్చు. మలుపు తిప్పవచ్చు. రివర్స్ చేయవచ్చు. అంతేకాకుండా.. ఫైటర్ జెట్ రూపాన్ని అందించే ఓపెన్ కాక్‌పిట్‌ను , డిజిటల్ డాష్‌బోర్డ్‌ను అమర్చారు.

నివేదిక ప్రకారం ఈ హోవర్ క్రాఫ్ట్ ధర రూ.75 లక్షలు. ఇది ఎయిర్ కుషన్ వాహనం. దీని సహాయంతో ఇది నీటిలో వేగంగా ప్రయాణిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన గాలి పీడనం సృష్టించబడుతుంది. దీంతో ఇది నీటిలో ప్రయాణిస్తుంది.

దీనిని సృష్టించిన కంపెనీ ఇప్పుడు మొదటి బ్యాచ్ లో 50 మోడళ్లను సిద్ధం చేస్తోంది. 75 లక్షలకు అందుబాటులోకి రానుంది. ఇటీవలే ప్రవేశపెట్టిన కారు రెడ్ కలర్ లో తీసుకొచ్చింది.





























