AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కేంద్ర, రాష్ట్ర మంత్రులకు క్యాబేజీలతో న్యూ ఇయర్ విషెస్.. ఎక్కడ..? ఎందుకు

నూతన సంవత్సరం అంటే పూల బొకేలు, పండ్లు, మొక్కలే కాదు… ఈసారి శ్రీకాకుళం రైతులు పూర్తిగా డిఫరెంట్‌గా ఆలోచించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు క్యాబేజీ పువ్వులతో శుభాకాంక్షలు తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించారు. .. ..

Andhra: కేంద్ర, రాష్ట్ర మంత్రులకు క్యాబేజీలతో న్యూ ఇయర్ విషెస్.. ఎక్కడ..? ఎందుకు
Cabbage Flowers Wishes
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jan 02, 2026 | 7:25 PM

Share

జనవరి 1వ తారీకు వచ్చిందంటే చాలు ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సంప్రదాయంగా కార్యకర్తలు, అధికారులు, అభిమానులు… నాయకులను కలిసి విషెస్ తెలియజేస్తారు. ఒట్టి చేతులతో వెళితే బాగోదని విషెస్ చెబుతూ బొకేలు, పళ్లు, మొక్కలు తీసుకువెళ్లి అందజేస్తూ ఉంటారు. అయితే ఇదంతా కామన్. శ్రీకాకుళం జిల్లా రైతులు వినూత్న రీతిలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా డిఫరెంట్‌గా క్యాబేజీ పువ్వులు అందజేసి విషెస్ తెలియజేశారు. అది కూడా వేరెవరికో కాదు సాక్షాత్తు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడులకు క్యాబేజీ పువ్వులతో శుభాకాంక్షలు తెలిపారు.

నూతన సంవత్సరం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులు గురువారం శ్రీకాకుళం జిల్లాలోని వారి స్వగ్రామం అయిన కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయం మంత్రులు ఇద్దరికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అధికారులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారిపోయింది. అయితే తమకు శుభాకాంక్షలు చేయడానికి వచ్చే వారు ఎవరు పూలు, బొకేలు తేవద్దంటూ మంత్రులు పత్రిక ప్రకటన ద్వారా ముందే తెలియజేశారు. ఈ నేపధ్యంలో గురువారం మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేసినవారిలో చాలా మంది ఒట్టి చేతులతోనే వచ్చి మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేయగా.. కొందరు మాత్రం బొకేలు, పూలదండలతో మంత్రులకు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం రైతులు క్యాబేజీ పువ్వులతో ఇద్దరు మంత్రులకు శుభాకాంక్షలు తెలపడం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ ప్రాంతంలో క్యాబేజీ పంట ఎక్కువగా ఉండడం వ్యవసాయ శాఖ మంత్రిగా, మన్యం జిల్లా ఇంచార్జి మంత్రిగా అచ్చనాయుడు ఉండడంతో రైతులు ఈ విధంగా ప్రత్యేకతను చాటుకునేందుకు క్యాబేజీ పువ్వులతో శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు ఈ వినూత్న తరహాలో ఇటువంటి శుభాకాంక్షలు ఎవరూ తెలపలేదని, ఇది ఓ ప్రత్యేకతను సంతరించుకుందని చూసేవారు అంటున్నారు. అయితే అందులోనూ వేరే అర్థం వెతికేవారు మాత్రం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని సందర్భాల్లో చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టవద్దని చెబుతూ ఇలా క్యాబేజీలతో నిరసనలు తెలిపే సందర్భాలు చూసాం కానీ అదే క్యాబిజీ లతో శుభాకాంక్షలు తెలియజేయటం ఏంటని గుసగుసలాడుకుంటున్నారు.