AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్ స్కాన్‌తో నేరుగా చెల్లింపులు.. ఆర్బీఐ మంచి అవకాశం

ఆర్బీఐ గతంలో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. చాలామందికి దీని గురించి అవగాహన ఉండటం లేదు. ఎలా వాడాకోవాలనేది తెలియడం లేదు. బ్యాంక్ అకౌంట్‌తో సంబంధ లేకుండా డిజిటల్ వ్యాలెట్ ద్వారా మీరు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

RBI: బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్ స్కాన్‌తో నేరుగా చెల్లింపులు.. ఆర్బీఐ మంచి అవకాశం
Digital Rupee
Venkatrao Lella
|

Updated on: Feb 20, 2026 | 8:47 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. పేపర్ నోట్లకు బదులు ఈ డిజిటల్ కరెన్సీకి సులువుగా ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. డిజిటల్ వ్యాలెట్ ద్వారా మీరు చెల్లింపులు చేయవచ్చు. ఫిజికల్ క్యాష్ ఉపయోగించుకోవాలంటే నోట్లు చినిగిపోతాయనే భయం ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా పొగొట్టుకోవచ్చు లేదా చోరీకి గురి కావొచ్చు. ఇక ఫిజికల్ క్యాష్‌ను పర్సులో క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్ కరెన్సీ ఉపయోగించే సమయంలో చిల్లర సమస్య కూడా ఏర్పడుతుంది. కానీ డిజిటల్ రూపీతో ఆ బాధలన్నీ ఏమీ ఉండవ్.

ఎలా తీసుకోవాలి..?

మీరు డిజిటల్ రూపీని తీసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్‌కు సంబంధించిన సీబీడీసీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ వెర్షన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. మీరు డౌన్ లోడ్ చేసుకుని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత పిన్ నెంబర్ సెట్ చేసుకోండి. బ్యాంక్ దగ్గర అప్పటికే మీ కేవైసీ వివరాలు, డాక్యుమెంట్స్ ఉంటాయి కనుక మీరు ఇక అలాంటి ప్రక్రియలు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు.

ఎలా ఉపయోగించాలంటే..?

యాప్‌లో లాగిన్ అయ్యాక సేవింగ్ అకౌంట్ నుంచి యాప్‌లోని డిజిటల్ వ్యాలెట్లోకి నగదును యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు డిజిటల్ టోకన్ల రూపంలో వ్యాలెట్‌లో డబ్బులు యాడ్ అవుతాయి. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ డిజిటల్ టోకెన్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇక వేరేవారికి నగుదును ట్రాన్స్‌ఫర్ కూడా చేయవచ్చు. ఇక వ్యాలెట్‌లో నిల్వ చేసే డబ్బులపై ఎలాంటి ఛార్జీలు, వడ్డీలు ఉండవు. ఇక వ్యాలెట్‌లోని డబ్బులకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. దీంతో వీటికి సురక్షితంగా వాడుకోవచ్చు. క్రిఫ్టో కరెన్సీ అయితే హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. ఇది అలాంటి డిజిటల్ కరెన్సీ కాదు. కేవలం మన చేతిలో ఉన్న నగదుకు డిజిటల్ రూపమే డిజిటల్ రూపీ. కాగా ఇటీవల డిజిటల్ రూపీ వినియోగం దేశంలో పెరుగుతోంది. రికార్డ్ స్థాయిలో దీని ద్వారా ట్రాన్సక్షన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి బ్యాంకులే డిజిటల్ రూపీ సేవలను అందిస్తున్నారు. దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఈ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రజలకు డిజిటల్ రూపీ పట్ల అవగాహన ఉండటం లేదు. దీంతో చాలామందికి ఎలా ఉపయోగించాలో తెలియడం లేదు.

Follow Us