AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్.. యాప్ ద్వారా క్షణాల్లోనే బుకింగ్.. ప్రభుత్వం కీలక ప్రకటన

ఏపీ రైతులకు గుడ్ న్యూస్. వ్యవసాయం కోసం అవసరమైన యంత్ర పరికరాలను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అనంతరం సమీపంలోని స్టోర్‌కి వెళ్లి తీసుకోవచ్చు. అద్దె కూడా చాలా తక్కువగా ఉంటుంది. వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు చేేసే స్తోమత లేని రైతులకు ఇది మంచి అవకాశం.

Andhra Pradesh: ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్.. యాప్ ద్వారా క్షణాల్లోనే బుకింగ్.. ప్రభుత్వం కీలక ప్రకటన
Ap Farmers
Venkatrao Lella
|

Updated on: Feb 20, 2026 | 7:44 AM

Share

ఏపీలోని రైతులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మంచి అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైతులకు అండగా నిలిచేందుకు అనేక పథకాలు అమలు చేస్తోన్న కూటమి సర్కార్.. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదేంటంటే.. రైతులకు తక్కువ అద్దెతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తోంది. రైతులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రెండు యాప్‌లను రాష్ట్ర వ్యవసాయశాఖ తీసుకొచ్చింది. నేరుగా మొబైల్ ద్వారా ఇంటి వద్ద నుంచే తమకు అవసరమైన యంత్ర పరికరాలను రైతులు బుక్ చేసుకోవచ్చు. ఏ జిల్లాల్లోని రైతులైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఏయే పరికరాలంటే..?

రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలైన ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, కంబైన్ హార్వెస్టర్లు, బేలర్లు వంటి యంత్రాలను ప్రభుత్వం అద్దె ప్రతిపాదన తక్కువ ఫీజులతో ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకోసం సమీపంలోని యంత్ర సేవా ప్రదాతల నుండి తీసుకోవచ్చు. ఇందుకోసం APAIMS 2.0, Uberization of Kisan Drones అనే యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని ఎప్పుడైనా రైతులు బుక్ చేసుకోవచ్చు. ఇక కిసాన్ డ్రోన్లను బుక్ చేసుకోవడానికి Uberization of Kisan Drones అనే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని, మిగతా యంత్ర పరికరాల కోసం APAIMS 2.0 యాప్‌ను ఉపయోగించాలని వ్యవసాయ శాఖ పేర్కొంది.

రైతులకు సబ్సిడీపై పరికరాలు

అటు రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు కొనుగోలు చేసే పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రైతులు తక్కువ ధరకు పరికరాలను కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వం ఇందుకోసం సబ్సిడీ సౌకర్యం కల్పిస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. రైతులు వీటిని కొనుగోలు చేయలంటే వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. అదే అద్దె ప్రాతిపదికన తక్కువ ధరకే తీసుకోవచ్చు. ఇది రైతులకు మంచి అవకాాశంగా చెప్పవచ్చు.

Follow Us