AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది కాలంగా తగ్గుతూ వస్తోన్న ధరలు.. గురువారం నుంచి పెరుగుతూ వస్తోన్నాయి. శుక్రవారం మరోసారి ధరలు పెరిగాయి. ఈ పెరుగుదల తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? అనే విషయాలు ఇందులో చూద్దాం

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
gold rates
Venkatrao Lella
|

Updated on: Feb 20, 2026 | 6:43 AM

Share

బంగారం ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గురువారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తోన్నాయి. అందులో భాగంగా శుక్రవారం కూడా మరోసారి బంగారం, వెండి ధరల్లో పెరుగుదుల నమోదైంది. వరుసగా రెండో రోజు పెరగడం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది. పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్న క్రమంలో పసిడి ధరలు పెరగడంతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇవాల్టీ గోల్డ్ రేట్లు ఇవే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,000 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. గురువారం దీని ధర రూ.1,56,490గా ఉంది. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,460గా ఉండగా.. నిన్న రూ.1,43,450 వద్ద కొనసాగుతోంది

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,500గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,460 వద్ద ఇప్పుడు కొనసాగుతున్నాయి

-ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,58,190 వద్ద కొనసాగుతోండగా.. నిన్న వీటి ధర రూ.1,58,180 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల ధర చూస్తే ఇవాళ రూ.1,45,010గా ఉండగా.. గురువారం రూ.1,45,000 వద్ద స్ధిరపడింది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,56,500 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,460గా ఉంది

-ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,650 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,610 వద్ద స్థిరపడింది

వెండి ధరలు ఇవే..

-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర శుక్రవారం రూ.2,70,100గా కొనసాగుతోంది. గురువారం రూ.2.70 లక్షల వద్ద ఉంది

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,70,100గా ఇప్పుడు కొనసాగుతోంది

-చెన్నై , బెంగళూరులో కేజీ సిల్వర్ రూ.2,70,100 వద్ద కొనసాగుతున్నాయి

Follow Us