AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇడ్లీ Vs దోశ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఉదయం ఏది తింటే మంచిది..!

Idli vs Dosa: దక్షిణాది భారతీయుల ఇళ్లలో బ్రేక్ ఫాస్ట్ అనగానే టక్కున గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశ. ఒకే రకమైన పిండితో తయారైనప్పటికీ, తయారీ విధానం వల్ల వీటి ప్రభావం ఆరోగ్యంపై భిన్నంగా ఉంటుంది. రుచిలో దోశకు ఓట్లు పడితే, ఆవిరిపై ఉడికిన ఇడ్లీకి ఆరోగ్యం విషయంలో ఎక్కువ మార్కులు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, గుండె సమస్యలు ఉన్నవారికి ఏది బెస్ట్..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Feb 20, 2026 | 7:25 AM

Share
ఆవిరి ఇడ్లీ: ఇడ్లీని ఒక సంపూర్ణ పోషకాహారంగా పరిగణించవచ్చు. ఇడ్లీని కేవలం ఆవిరిపై ఉడికించడం వల్ల ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువ. గుండె సమస్యలు ఉన్నవాళ్లకు, బీపీ ఉన్నవారికి ఇది దివ్యౌషధం. పిండిని పులియబెట్టడం వల్ల ఇందులో సహజసిద్ధమైన ప్రోబయోటిక్స్ వృద్ధి చెందుతాయి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి, అరుగుదలకు తోడ్పడతాయి. దోశతో పోలిస్తే ఇడ్లీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర స్థాయిలు అదుపులో ఉండటానికి సహాయపడుతుంది.

1 / 5
దోశ: చాలామంది దోశ కేవలం రుచికే అనుకుంటారు. కానీ దీన్ని స్మార్ట్‌గా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. దోశ తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల ఇతర స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. దోశలో క్యారెట్, ఉల్లిపాయలు, లేదా పనీర్ వంటి ఫిల్లింగ్స్ చేర్చుకునే వీలుంది. దీనివల్ల మనకు ఒకేసారి ఫైబర్, ప్రోటీన్ అందుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి లేదా యామానికి ముందు శక్తి కావాలనుకునే వారికి దోశలోని కార్బోహైడ్రేట్లు ఇంధనంలా పనిచేస్తాయి.

2 / 5
కేలరీల లెక్క: బరువు తగ్గడంలో కేలరీల లెక్కలు చాలా ముఖ్యం. ఇక్కడే ఇడ్లీ స్పష్టమైన విజేతగా నిలుస్తుంది. ఒక మీడియం ఇడ్లీలో కేవలం 39-45 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిని ఆవిరిపై ఉడికించడం వల్ల నూనె అవసరం ఉండదు. ఒక సాధారణ దోశలో 120-150 కేలరీలు ఉంటాయి. దీనిని క్రిస్పీగా మార్చేందుకు వాడే నూనె లేదా నెయ్యి వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ఒక దోశ తినే బదులు మూడు ఇడ్లీలు తిన్నా తక్కువ కేలరీలే శరీరానికి అందుతాయి.

3 / 5
ప్రోటీన్ - ఫైబర్ బూస్ట్: బరువు తగ్గడానికి ప్రోటీన్, ఫైబర్ చాలా అవసరం. నిపుణుల సూచనల ప్రకారం వీటిని మరింత హెల్తీగా మార్చుకోవచ్చు. సాధారణ దోశ కంటే పెసరట్టులో ప్రోటీన్ ఎక్కువ, కార్బోహైడ్రేట్లు తక్కువ. ఇది బెస్ట్ వెయిట్ లాస్ ఆప్షన్. రాగులు, ఓట్స్ ఇడ్లీలో ఫైబర్, కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి.

4 / 5
 మీ ప్లేట్‌లో ఏది ఉండాలి?
మీరు కఠినమైన డైట్‌లో ఉండి, కేలరీలను తగ్గించుకోవాలి అనుకుంటే ఇడ్లీ మీ మొదటి ఛాయిస్ కావాలి. ఒకవేళ మీరు దోశను వదులుకోలేకపోతే, నాన్-స్టిక్ పాన్ వాడి అతి తక్కువ నూనెతో కాల్చుకోవడం లేదా పెసరట్టు వంటి ప్రోటీన్ రిచ్ దోశలను ఎంచుకోవడం ఉత్తమం. ఇడ్లీ అయినా, దోశ అయినా వాటిని అధిక ప్రోటీన్ కలిగిన సాంబార్, పప్పుల చట్నీతో కలిపి తీసుకుంటేనే అది సంపూర్ణ పోషకాహారంగా మారుతుంది.

మీ ప్లేట్‌లో ఏది ఉండాలి? మీరు కఠినమైన డైట్‌లో ఉండి, కేలరీలను తగ్గించుకోవాలి అనుకుంటే ఇడ్లీ మీ మొదటి ఛాయిస్ కావాలి. ఒకవేళ మీరు దోశను వదులుకోలేకపోతే, నాన్-స్టిక్ పాన్ వాడి అతి తక్కువ నూనెతో కాల్చుకోవడం లేదా పెసరట్టు వంటి ప్రోటీన్ రిచ్ దోశలను ఎంచుకోవడం ఉత్తమం. ఇడ్లీ అయినా, దోశ అయినా వాటిని అధిక ప్రోటీన్ కలిగిన సాంబార్, పప్పుల చట్నీతో కలిపి తీసుకుంటేనే అది సంపూర్ణ పోషకాహారంగా మారుతుంది.

5 / 5
Follow Us